సోనియా గాంధీని పోలి ఉందనే సమస్య
ప్రకాష్ ఝా తాజా చిత్రం 'రాజ్‌నీతి' రిలీజ్ కి సోనియా గాంధీ పోలిక ఆటంకం తెచ్చిపెట్టేటట్లు ఉంది. ఆ చిత్రంలో కీలకపాత్ర చేసిన కత్రినా కైఫ్ వేషధారణ సోనియా గాంధీని పోలి ఉందంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాంతో చిత్రానికి సంబంధించిన పబ్లిసిటీ కాంపయిన్ కి ఢిల్లీలో అనుమతి లభించలేదు. డిల్లిలో ప్రకాష్ ఝాతోపాటు కత్రిన, రణబీర్ కపూర్‌లు ప్రేక్షకుల్ని కలుసుకొనేందుకు పర్యటన చేయాలనుకొన్నారు. అయితే పోలీసు శాఖ నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. దాంతో మీడియా దర్శకుడు ప్రకాష్ ఝాను కలిసి ప్రశ్నించింది. సోనియాని పోలిన పాత్ర ఉండటం వల్లనే అనుమతిని నిరాకరించారని మీరు భావిస్తున్నారా? అని ఆయన్ని ప్రశ్నించగా "ఈ విషయమై నేనేమీ స్పందించదలచుకోలేదు. కత్రినా పాత్రకు సోనియాకు ఎలాంటి సంబంధం లేదు. నేను మా సినిమాను త్వరలో సోనియాజీకి చూపిస్తాను. ఆమెకు నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. అలాగే 'రాజ్ నీతి' అనుకున్న డేట్ కి తప్పనిసరిగా రిలీజ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











