Jai Hanuman: హనుమంతుడుగా రిషబ్ శెట్టి.. ట్రోలింగ్ పై ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్..
Jai Hanuman: యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashant Verma) కాంబినేషన్‌లో వచ్చిన బాక్ట్ బస్టర్ మూవీ 'హనుమాన్' (Hanuman). సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ ఎంత భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. భారీ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా 'జై హనుమాన్'(Jai Hanuman) అనే మూవీని వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీపావళి కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు ప్రశాంత్ వర్మ. అయితే.. Jai Hanuman మూవీలో హనుమాన్ పాత్ర డిజైన్ పై కొంతమంది ప్రశంసలు కురిపిస్తూంటే.. మరికొంత మంది మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోల్స్ కు చెక్ పడేలా ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దిమ్మతిరిగిపోయే పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి?
యంగ్ తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'హనుమాన్'. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ గత రికార్డులను బ్రేక్ చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఎవ్వరి ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.350 కోట్లు వసూళ్లు రాబట్టింది. యంగ్ హీరో తేజ కెరీర్ లో అల్ టైం హిట్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీకి సీక్వెల్ గా 'జై హనుమాన్'(Jai Hanuman) అనే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలకు పెంచేలా, ఈ మూవీ ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపేలా ఎప్పటికప్పుడూ అప్డేట్ వస్తునే ఉన్నాయి.

'జై హనుమాన్' (Jai Hanuman) మూవీలో మెయిన్ రూల్ అయినా హనుమంతుడు (Hanuman) పాత్రపై ఇటీవలే క్లారిటీ వచ్చింది. ఈ పాత్రలో చిరంజీవి, రామ్ చరణ్, రానాలతో చర్చించినట్టు టాక్. వీరిలో ఎవరైనా ఒకరు ఈ పాత్రలో నటించబోతున్నారనే వార్తలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలకు చెక్ వేస్తూ.. హనుమంతుడు పాత్రలో కాంతార హీరో, కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishabh Shetty) ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. హనుమాన్ పాత్ర కోసం మూవీ మేకర్స్ రిషబ్ శెట్టిని సంప్రదించగా.. ఆ దేవుడిపై ఉన్న భక్తితో ఆ క్యారెక్టర్ ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాత్ర కోసం రిషబ్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
హనుమాన్ పాత్రలో హీరో రిషబ్ శెట్టి కనిపించడం తో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ తెలుగు హీరోలను పక్కనపెట్టి కన్నడ హీరోకు ప్రాధాన్యత ఇవ్వడంపై కాస్త వేముకుత కనిపించింది. ఇదే సమయంలో తెలుగు అభిమానుల నుండి ప్రశాంత్ వర్మ విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. పైగా హనుమంతుడు పాత్రలో వృష ప్ చాలా సింపుల్ గా కనిపిస్తున్నాడని, కామెంట్స్ కూడా పెట్టారు. ఈ కామెంట్స్ అన్నిటికి సమాధానం చెబుతూ ప్రశాంత్ వర్మ తాజాగా ఓ పోస్ట్ చేశాడు.

ఇంతకీ ఆ పోస్టులో ఏం పేర్కొన్నారు అంటే..
ప్రశాంత్ వర్మ తన ఎక్స్ లో జై హనుమాన్ ఫస్ట్ లుక్ కి వస్తున్న అపూర్వ ప్రేమ, ఆదరణలు వస్తున్నాయి. హనుమాన్ పాత్రలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు శెట్టి నటిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. హనుమంతుని పట్ల అతనికి ఉన్న భక్తి, సాటిలేని అంకితభావం నిజంగా ఆ పాత్రకు ప్రాణం పోస్తాయి. అతని అద్భుతమైన నటనతో ఆ పాత్రకు మరింత పరిపూర్ణత తీసుకవచ్చాయి. 'జై హనుమాన్' మూవీ నిజంగా అసాధారణమైనదిగా మారుతుంది. కర్నాటక నుండి ప్రపంచవ్యాప్తంగా.. అతనికి తన అభిమానులకు మరపురాని అనుభూతిని అందించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టలేదు. జై హనుమాన్ ప్రయాణాన్ని మీతో ప్రారంభించినందుకు మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. జై హనుమాన్ జై జై హనుమాన్" అంటూ ప్రశాంత్ వర్మ పేర్కోన్నారు.
ఇదెలా ఉంటే.. జైహనుమాన్ లో ప్రధాన పాత్రలో నటించడానికి హీరో రిషబ్ శెట్టి భారీ మొత్తంతో డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఆ పాత్రలో నటించడానికి రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ లేదా లాభాలలో 50% వాటా డిమాండ్ చేశారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











