Kgf Chapter 3 : ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్‌.. మూడో పార్ట్ కూడా.. అలా హింట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్

వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్ అని KGF ట్రైలర్లో యష్ అన్నట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా KGF, KGF, KGF అనే మాట వినిపిస్తోంది. అసలు ఏ మాత్రం ఊహించని విధంగా విడుదలై KGF మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ కావడంతో రెండో భాగం తెరకెక్కిస్తామని గతంలోనే ప్రకటించారు. ఆ ప్రకటించినట్టుగానే KGF రెండో చాప్టర్ ను సిద్ధం చేశారు. ఇప్పుడు అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా చివరిలో KGF 3 అని హింట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

హోంబలే ఫిలింస్ నిర్మాణంలో

హోంబలే ఫిలింస్ నిర్మాణంలో

ఇప్పుడు ఎక్కడ చూసినా KGF అనే మాట వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'KGF చాప్టర్ 2' ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. కన్నడ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. యష్ సరసన హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. సంజయ్ దత్ అలాగే రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఛాప్టర్ 2లో రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

సినిమాకు మంచి టాక్

సినిమాకు మంచి టాక్

ప్రశాంత్ నీల్ యష్ కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమాను వీక్షించేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు. మొదటి రోజు సినిమా చూసేందుకు వరల్డ్ వైడ్ 40 లక్షలకు పైగా టికెట్లు బుక్ చేసుకున్నారు అంటే ఈ సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

భారీ అంచనాలతో విడుదలైన ఈ KGF చాప్టర్ 2 కూడా అంచనాలను మించియేలా కనిపిస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాలలో షోలు ముగియగా సినిమాకు మంచి టాక్ అయితే బయటకి వచ్చింది.

RRR దూకుడు

RRR దూకుడు

అంతేకాదు ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్స్ కూడా సాధించేట్టు ఉందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బాహుబలి, RRR రికార్డులను బ్రేక్ చేసేలా కనిపిస్తుందని కూడా అంచనాలు వస్తున్నాయి. ఈ సినిమాకు బీస్ట్ పోటీగా ఉంటుందని అనుకుంటే అది తుస్సు మంది. ఈ క్రమంలో ఈ భారీ బడ్జెట్ సినిమాకి ఆచార్య రంగంలోకి దిగేదాకా అంటే మరో పదిహేను రోజుల పాటు పోటీగా మరే సినిమా లేదనే చెప్పాలి. మార్చి 25న రిలీజ్ అయిన RRR దూకుడు కూడా క్రమంగా తగ్గడం ఈ సినిమాకు కలిసి రానుంది.

మూడో భాగానికి అవకాశం

మూడో భాగానికి అవకాశం

ఆ సంగతి పక్కనపెడితే ఈ సినిమాకు మూడో భాగం కూడా ఉందని అంటున్నారు. దానికి ఊతం ఇచ్చేలా కొన్ని సీన్స్ ఉంచాడు ప్రశాంత్ నీల్. రెండో భాగంలో ప్రధాన మంత్రి గా నటిస్తున్న రవీనా టండన్ KGF పుస్తకాన్ని చదువుతున్న క్రమంలో కవర్ పేజీని తిప్పే క్రమంలో KGF చాప్టర్ 3 అని కనిపించడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. అయితే రెండో భాగంలో యష్ పాత్ర చనిపోయినట్టు చూపారు కానీ అది ఖచ్చితం అని చెప్పలేం. ఆయన సముద్రంలో పడినట్టు చూపడంతో పాటు రామికా సేన్, ఇనాయత్ ఖలీల్ అనే పాత్రలు బతికే ఉండడంతో మూడో భాగానికి అవకాశం ఉందని అంటున్నారు.

అధికారిక ప్రకటన

అధికారిక ప్రకటన

నిజానికి KGF చాప్టర్ 3 వస్తుందనే విషయం మీద KGF 2 ప్రమోషన్స్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా KGF 3పై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. 'సార్ KGF 3 కూడా వచ్చే అవకాశం ఉందా అని అర్ధం వచ్చేలా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు.. 'ఏమో చూడాలి.. ఛాప్టర్ 2 చూస్తే మీకే అర్థమవుతుంది' అని ప్రశాంత్ నీల్ బదులిచ్చారు. ఈ కామెంట్ తోనే KGF చాప్టర్ 3 కూడా రానున్నట్టు అనుమానాలు ఏర్పడగా ఇప్పుడు సినిమా చూశాక అది కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పటిదాకా KGF మేకర్స్ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X