జాంబీ రెడ్డి త్రివిక్రమ్ స్టైల్‌లోనే..చాలా బెదిరింపులు వచ్చాయి..పాన్ ఇండియా సీక్వెల్: ప్రశాంత్ వర్మ
అ! సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తరువాత రాజశేఖర్ తో కల్కి సినిమా చేశాడు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అయితే అంధించలేదు. ఇక మూడవసారి జాంబీస్ జానర్ ను టచ్ చేస్తున్నాడు. నేడు ఈ సినిమా గ్రాండ్ గా విడుదలవుతోంది. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో మొదటిసారి ఒక జాంబీ ఫిల్మ్ ను తెరకెక్కించినట్లు ప్రమోట్ చేస్తూన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు.

నమ్మకం పెట్టుకున్న హీరో
జాంబీ రెడ్డి టీజర్ కు ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాకు ఇండస్ట్రీలో ఓ వర్గం సెలబ్రెటీల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ప్రశాంత్ వర్మ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. యువ హీరోగా పరిచయం అవుతున్న తేజ సజ్జకు కూడా ఈ సినిమా రిజల్ట్ పైనే హోప్స్ పెట్టుకున్నాడు. ఇక ప్రమోషన్ లో బాగంగా దర్శకుడు ఓక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు.

సినిమా కొత్తగా ఉంటుంది
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. అసలు ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ అనుకోకుండా ఆలస్యం అయ్యింది. మన సినిమాల్లో లవ్ జానర్ తో పాటు జాంబీ జానర్ కూడా అలాంటిదే. తెలుగు వాళ్ళకే ఈజీగా కనెక్ట్ అయ్యేలా మన వాతావరణానికి తగ్గట్లుగా సినిమా తీశాను. హాలీవుడ్ జాంబీ సినిమాలు చూసిన వారికి కూడా సినిమా కొత్తగా ఉంటుంది.. అని చెప్పాడు.

త్రివిక్రమ్ స్టైల్ లోనే..
ఎనిమిదేళ్ల నుంచి సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు కుదిరింది. తెలియని విషయాన్ని అందరికి తెలిసేలా చెబితేనే ఈజీగా అర్థమవుతుంది. త్రివిక్రమ్ గారు అలానే చేస్తుంటారు. మహాభారతం, బాగవతం వంటి విషయాలను తన సినిమాల ద్వారా సరికొత్తగా చెబుతుంటారు. నేను కూడా అలానే జాంబీ కాన్సెప్ట్ కు ఫ్యాక్షన్ ను యాడ్ చేశాను.

టైటిల్ అలా పెట్టాడానికి కారణం
జాంబీరెడ్డి టైటిల్ పెట్టినప్పుడు బెదిరింపులు చాలానే వచ్చాయి. ఆ టైటిల్ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే కథ నడుస్తుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. అంతే గాని ఎవరిని కించపరచాలని కాదు. సినిమాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియెన్స్ కు తప్పకుండా ఈ జానర్ నచ్చుతుందని నమ్ముతున్నాను

అంతగా క్లిక్కవ్వదని అన్నారు
అయితే ఇండస్ట్రీలో కొన్నిసార్లు భిన్నమైన స్వరాలు వినిపించాయి. సినిమా గురించి తెలిసిన వారు కొందరు ఈ జానర్ అంతగా క్లిక్కవ్వదని ప్రేక్షకులకు అర్థం కాదని వదిలేశం అంటూ వివరణ ఇచ్చారు. మరికొందరేమో కొత్తగా ఉందని మెచ్చుకున్నారు. మెయిన్ గా ట్రైలర్ చూసి కొందరు మంచి ఐడియా అంటూ మెచ్చుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది.

హిట్టయితే పాన్ ఇండియా రేంజ్ లో
ఇక జాంబీ రెడ్డి టీజర్ వచ్చినప్పుడే రీమేక్ హక్కులపై ఆఫర్స్ చాలానే వచ్చాయి. ఈ సినిమాను పెద్ద హీరోతో తీస్తే మార్కెట్ ఇంకా బాగుండేది. అప్పుడు సినిమాకు కనీసం రెండేళ్లు పట్టేది కూడా. కానీ చాలా వేగంగా తియ్యాలని తేజను సెలెక్ట్ చేసుకున్నా. హిట్టయితే పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్ తీసేందుకు రెడీగా ఉంటాను. ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అంటూ.. ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











