»   »  హీరోయిన్ నగ్నదృశ్యాన్ని దాచుకున్న దర్శకుడు

హీరోయిన్ నగ్నదృశ్యాన్ని దాచుకున్న దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Madhur Bhandarkar
ఫైర్ బ్రాండ్ బాలీవుడ్ డైరెక్టర్ మాధుర్ భండార్కర్ సమాజంలోని అక్రమాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తారని పేరుంది. ఈసారి ఆయన ఫ్యాషన్ రంగం మీద సినిమా తీశారు. ఎంతో గ్లామర్ ఉన్న ఆ రంగంలోని చీకటి కోణాలను కూడా ఆయన చిత్రీకరించారు. కథలో భాగంగా ఆయన హీరోయిన్ కంగనా రనౌత్ ను పూర్తి నగ్నంగా చిత్రీకరించారు. కథలో భాగమే కాబట్టి హాలివుడ్ లో అయితే ఆ దృశ్యానికి కత్తెర పడేది కాదు.

కానీ భారతీయ సెన్సార్ నిబంధనల ప్రకారం ఆ దృశ్యం సినిమా నుంచి అదృశ్యం అయింది. అయినా మాధుర్ ఆ క్లిప్ ను భద్రంగా తన వద్ద ఉంచుకున్నట్టు తెలుస్తోంది. ఆ దృశ్యాన్ని ఆయన ఏం చేస్తారోనన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X