‘అనుష్క పెళ్లి చేసుకోకు.. హీరోయిన్లు పెళ్లిచేసుకొంటే నాకు నచ్చదు‘
అరుంధతి, దేవసేన, భాగమతి లాంటి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అనుష్కశెట్టి 15 సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకొన్నది. ఈ సందర్భంగా నిశ్శబ్దం మూవీ యూనిట్ గురువారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో అనుష్కను ప్రశంసించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూరీ జగన్నాథ్, రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరీ, వీరు పోట్ల, వాసు లాంటి దర్శకులు.. శ్యాంప్రసాద్ రెడ్డి, డీ సురేష్, పీవీపీ లాంటి నిర్మాతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్బంగా..

జీవితంలో స్థిరపడు అనుష్క
అనుష్కపై దర్శకులు రాఘవేంద్రరావు ప్రశంసల వర్షం కురిపించారు. స్వీటీ మంచితనానికి మారుపేరు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. చివరకు అన్ని రకాల పాత్రలను పోషిస్తూ మెప్పిస్తున్న అనుష్క పెళ్లి చేసుకోని జీవితంలో స్థిరపడాలని సలహా ఇచ్చారు. అందుకు అనుష్క చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చింది.

జీవిత భాగస్వామిని చూసుకో
ఇక అరుంధతి లాంటి గొప్ప చిత్రాన్ని అనుష్కకు అందించిన శ్యాంప్రసాద్ రెడ్డి ఆమె గొప్పతనాన్ని ఈ సందర్భంగా వెలుగులోకి తెచ్చారు. నటిగానే కాకుండా మానవత్వం ఉన్న వ్యక్తి అంటూ అనుష్కను ఆకాశానికి ఎత్తేశాడు. ఇక మంచి జీవిత భాగస్వామిని చూసుకోని లైఫ్‌ను బాగా ఎంజాయ్ చేయాలని అన్నారు.

లైఫ్‌లో స్థిరపడాలని..
ఇక వీరు పోట్ల మాట్లాడుతూ.. రగడ సినిమాలో అనుష్కతో పనిచేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆ సందర్భంగా మీరు మరో పదేళ్లు స్టార్ హీరోయిన్‌గా కొనసాగాలని అంటే.. పదేళ్ల తర్వాత కూడా సినిమాలేనా? పెళ్లి చేసుకోవద్దా? దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేయవద్దా అని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా జీవితంలో స్థిరపడాలని ఆకాక్షించారు.

అనుష్క పెళ్లి చేసుకోవద్దు..
ఇలా దర్శకులు అందరూ అనుష్కను ప్రశంసిస్తూ.. పెళ్లి చేసుకోవాలని సూచిస్తుండటాన్ని గమనించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ చటుక్కున మైక్ అందుకొని.. అనుష్క పెళ్లి చేసుకోవద్దు. ఎందుకంటే హీరోయిన్లు పెళ్లి చేసుకొంటే నాకు నచ్చదు. అనుష్క నీవు లైఫ్ ఎంజాయ్ చేయి అంటూ పూరీ పేర్కొన్నారు.
Recommended Video


ఎప్పుడు జరగాలని ఉంటే.. అప్పుడే
తన పెళ్లిపై పలువురు ఆసక్తి చూపించడంపై చివర్లో అనుష్క స్పందించింది. పెళ్లి అనేది ఎప్పుడు జరగాలో.. అప్పుడు జరుగుతుంది. దాని కోసం వెయిట్ చేయడం తప్ప మరోటి లేదు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సమయం ఎప్పుడు వస్తుందో వేచిచూడాల్సిందే అని అనుష్క అన్నారు. తనపై అభిమానాన్ని కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











