‘మహానాయకుడు’లో ఆ సీన్ చూసి వెక్కి వెక్కి ఏడ్చాను: పూరి జగన్నాధ్
ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఎన్టీఆర్-మహానాయుడు' సినిమా ప్రీమియర్ షోకు హాజరైన ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ సినిమా చూసిన అనంతరం తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నారు.
'ఎన్టీఆర్-కథానాయకుడు' మూవీ నాకు ఎంత నచ్చిందో.. అంతకంటే ఎక్కువ 'మహానాయకుడు' నచ్చింది. బసవతారకంగారి గురించి చెప్పే డైలాగులు చూసి ఏడ్చాను. అసెంబ్లీలో ఆయనకు జరిగిన అవమానం చూసి వెక్కి వెక్కి ఏడ్చాను. ఇంతలా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఇంతగా ఏడవలేదని పూరి వ్యాఖ్యానించారు.

మహానాయకుడు సినిమా ఎంత గొప్పదో బాలయ్య నటన ఇంకా అంత గొప్పగా ఉంది. ఆయన కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్. నాన్నగారు అంటే ఆయనకు ఎంత అభిమానమో, ఎంత ప్రేమో నాకు తెలుసు. ఆయన ప్రేమతో ఇష్టంగా చేసిన ఫిల్మ్ ఇదన్నారు.
క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించారు. ఆయనకు జోడీగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. చంద్రబాబు నాయుడి పాత్రలో రాణా నటించారు. ఈ చిత్రాన్ని ఎన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణతో కలిసి విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











