Liger: మైక్ టైసన్ ఇండియాకు అందుకే రాలేదు.. అప్పుడు తీసుకోస్తాం అంటూ పూరి క్లారిటీ..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా పూరి జగన్నాథ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతోంది. అలాగే విజయ్ దేవరకొండకు కూడా ఇది సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయింది.

ఇటీవల ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్స్ కు భారీ స్థాయిలో స్పందన లభించడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో ఒకసారి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. దాదాపు ఫస్ట్ డే మాస్ ఏరియాల్లో మొత్తం థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనమిచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ కనిపించబోతున్నాడు.

director puri Jagannath clarification on Mike Tyson india visit plan

అలాగే రియల్ బాక్సర్ బైక్ టైసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే మైక్ టైసన్ ను చిత్ర యూనిట్ సభ్యులు ఇండియాకు ఇన్వైట్ చేయలేదా అనే కామెంట్స్ చాలానే వచ్చాయి. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ఇటీవల పూరి జగన్నాథ్ తో ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ చేయగా అందులో కూడా ఇదే విషయాన్ని అడిగారు. అయితే అందుకు పూరి అలాంటి పెద్ద సెలబ్రిటీని ఇండియాకు తీసుకొస్తే ప్రస్తుతం మేమున్న బిజీ షెడ్యూల్లో సాధ్యమయ్యే పని కాదు మేము సినిమా ప్రమోషన్స్ పక్కన పెట్టే మొత్తం ఆయన పైనే ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. అందుకే ఈ టైమ్ లో మైక్ టైసన్ రాలేని పరిస్థితి.

కాబట్టి సినిమా రిలీజ్ తర్వాత ఒక మూడు వారాలు తర్వాత తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని పూరి జగన్నాథ్ వివరణ ఇచ్చాడు. ఆయనతో షూటింగ్ జరిగినన్ని రోజులు కూడా ఒక కొత్త అనుభూతి చెందాము అని ఆయనకు ఇండియా అంటే కూడా చాలా అభిమానం అని ముఖ్యంగా ఇండియన్ ఫుడ్ ఎంతో ఇష్టంగా తిన్నట్లుగా పూరి జగన్నాథ్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X