పూరి జగన్నాథ్ కూతురు ఎమోషనల్ ఫొటోస్.. ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటాము అంటూ..

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరపైకి వచ్చింది. అంతేకాకుండా చాలా ఎక్కువ సమయం తీసుకొని ఈ సినిమాను నిర్మించారు అయితే ఈ సినిమా హడావిడిలో అందరూ బిజీగా ఉండగా పూరి జగన్నాథ్ కూతురు పవిత్ర సోషల్ మీడియాలో వివరణ ఇచ్చిన విధానం వైరల్ గా మారింది. ఆమె పోస్టులో తన తండ్రిపై ఎంతగా నమ్మకం ఉందో అర్థమయ్యేలా తెలియజేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

ఎక్కువ టైమ్

ఎక్కువ టైమ్

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కలయికలో వచ్చిన మొదటి సినిమా లైగర్ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. కేవలం ఇది విజయ్ కు మాత్రమే కాకుండా పూరి జగన్నాథ్ కెరీర్ కు కూడా ఎంతో ముఖ్యమైన సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు ఒక విధంగా పూరి జగన్నాథ్ అయితే తన కెరీర్లో మొదటిసారి చాలా ఎక్కువ సమయం తీసుకుని ఈ స్క్రిప్ట్ రాయడం జరిగింది. అలాగే షూటింగ్ కోసం కూడా చాలా ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది.

 పవిత్ర పూరి

పవిత్ర పూరి

ఈ క్రమంలో పూరి అభిమానులు లైగర్ సినిమా సక్సెస్ కావాలి అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక అందరికంటే ఎక్కువగా ఆయన గారాల కూతురు పవిత్ర పూరి కూడా ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పూరి జగన్నాథ్ కు తన కూతురు అంటే చాలా ఇష్టం. పవిత్ర గతంలో బుజ్జిగాడు సినిమాలో చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

 నా ఫేవరెట్ లవ్..

నా ఫేవరెట్ లవ్..

ఇక పవిత్ర పూరి ఈ విధంగా తన వివరణ ఇచ్చింది.. నాన్న ఇప్పుడు నువ్వు నా ఫేవరెట్ లవ్. నేను ఎప్పుడూ కూడా ఇంత నర్వస్ గా ఫీల్ కాలేదు. ఎందుకంటే లైగర్ రిలీజ్ రోజు నీకు ఒక బిగ్ డే. ఈరోజు కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. కష్టానికి తగ్గ ఫలితం ఇప్పుడు దక్కుతుందిమ్ ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. మేము మీ ప్రతి విషయంలో కూడా చాలా గర్వంగా ఉంటాము నీకోసం ఇంటిదగ్గర ఎదురుచూస్తూ ఉంటాము.. అని పేర్కొన్నారు.

రిస్క్ చేయడానికి

రిస్క్ చేయడానికి

కొత్తగా ఏవైనా అవకాశాలు అందుకోవాలి.. రిస్క్ చేయడానికి కూడా భయపడకూడదు అని నేర్చుకున్నాము. నిన్ను ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకున్నాను. లైగర్ మూవీ టీం మొత్తం కూడా ఎంతగా హార్డ్ వర్క్ చేసిందో ఎంతగా స్ట్రగుల్ అయ్యారో కూడా మాకు తెలుసు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి అని టీమ్ మొత్తానికి కూడా గుడ్ గుడ్ లక్.. అని తెలిపారు

నువ్వే నా బలహీనత..

నువ్వే నా బలహీనత..

నువ్వే నా ధైర్యం నువ్వే నా బలహీనత. ఈ సినిమా చూసేటప్పుడు నువ్వు రేపు మా దగ్గర ఉండకపోవచ్చు.. కానీ సినిమా చూస్తున్నంత సేపు కూడా ఆ ఆనందం విజిల్స్ కూడా నిన్ను చేరుకుంటాయి. నేను సినిమా చూసేందుకు ఆగలేకపోతున్నాను. ఎల్లప్పుడూ నిన్ను ఎంతగానో మేము ప్రేమిస్తూనే ఉంటాము.మ్ అని పవిత్ర పూరి వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X