Vijay Devarakonda పూరి జనగణమనపై మరో షాకింగ్ అప్డేట్.. లైగర్ కంటే ముందే..
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సరికొత్త కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఒక్క సారిగా అంచనాలను పెంచేస్తున్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లైగర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరపైకి రాబోతున్న ఈ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో రూపొందుతుంది. అయితే ఈ సినిమాకంటే ముందే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ మరొక ఆసక్తికరమైన ప్రాజెక్టులను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సక్సెస్ ఫార్ములా..
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మొదటిసారి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ మొదటిసారి ఒక ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. గతంలో పూరి జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు మరొకసారి విజయ్ దేవరకొండ తో సక్సెస్ ఫార్ములాని ఉపయోగిస్తున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలో..
పూరి జగన్నాథ్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో మాస్ పంచ్ డైలాగ్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా సాలిడ్ గా ఉంటాయని చెప్పవచ్చు. లైగర్ సినిమాలో కూడా అలాంటి సీన్స్ మాస్ ప్రేక్షకులను విజిల్స్ వేయించేలా ఉంటాయట. ఫస్టాఫ్ లో ఒక లోకల్ బాక్సర్ గా కనిపించే విజయ్ దేవరకొండ సెకండ్ హాఫ్ లో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తాడట. సినిమాలో స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని సమాచారం.

లిస్టులోకి జనగణమన
అయితే లైగర్ సినిమాకంటే ముందే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మరొక సినిమా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. పూరి జగన్నాథ్ గత కొంత కాలంగా జనగణమన అనే ఒక ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. గతంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు వంటి హీరోలతో కూడా ఈ కథ చేయాలని అనుకున్నాడు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ తో పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

లైగర్ కంటే ముందే
విజయ్ దేవరకొండ తో హీరోయిన్ గా జాన్వీకపూర్ నటించే అవకాశం ఉందట. జనగణమన పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అందరికీ తెలిసిన విషయమే మహేష్ బాబు తో ఆల్మోస్ట్ సెట్టయిన తరువాత ఆ ప్రాజెక్ట్ మళ్ళీ క్యాన్సిల్ అయింది. ఇక పూరి అయితే ఆ ప్రాజెక్టు ను ఎలాగైనా ఫినిష్ చేయాలి అని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. అందుకే లైగర్ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టే ఆ లోపే 'జనగణమన' పని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video

వేగంగా పూర్తి చేసేలా..
లైగర్ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఆలస్యం చేయకుండా పూరి జగన్నాథ్ మరొక ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే జనగణమన అనే సినిమా లైన్ లోకి తీసుకు వచ్చినట్లు సమాచారం. పూరి కరెక్ట్ గా అనుకుంటే సినిమాను రెండు మూడు నెలల్లో కూడా పూర్తి చేయగలడు. బిజినెస్ మెన్ సినిమాను కేవలం రెండు నెలల్లోపే ఫినిష్ చేసి అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో జనగణమన సినిమాను కూడా ఫినిష్ చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











