వల్గర్ కామెడీతో పూరీ జగన్నాథ్ బొక్కా బోర్లా.. ఆలీని స్వయంగా తన చేతులతోనే!

పూరీ జగన్నాథ్- కమెడియన్ అలీది విడదీయరాని బంధం. దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాటి నుంచి నేటి వరకు అలీ లేకుండా సినిమా తీయరు పూరి. ఆయనను లక్కీ హ్యాండ్‌గా భావించే జగన్నాథ్.. తన సినిమాలలో ఖచ్చితంగా ఓ క్యారెక్టర్ రాస్తారు. తాను ఫెయిలైతే వచ్చి ఓ పెగ్ పోసి భుజం తట్టి వెళ్తాడని.. అదే హిట్ కొడితే ఓ బొకేతో వస్తాడని అలీతో తనకున్న అనుబంధాన్ని ఎన్నోసార్లు చెప్పారు పూరి జగన్నాథ్. అలాంటిది తన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్‌లో అలీ నటించిన సీన్స్‌ని పూరి తొలగించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

పూరి జగన్నాథ్- ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో గతంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తీశారు. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్‌లు ఈ సినిమాను నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది.

director puri jagannath shock to comedian ali is these scenes removed from ram pothineni s double ismart

ఇస్మార్ట్ శంకర్ ప్రభావంతో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.60 కోట్లపైనే జరిగింది. ట్రైలర్, టీజర్, పోస్టర్స్.. ఇతర ప్రమోషన్ కార్యక్రమాలతో జనం థియేటర్లకు బాగానే వచ్చారు. దీంతో డబుల్ ఇస్మార్ట్ కు ఓపెనింగ్స్ బాగానే వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 45 నుంచి 50 శాతం ఆక్యూపెన్సీ వచ్చిందని.. కానీ కర్ణాటక, హిందీ బెల్ట్‌లో మాత్రం డబుల్ ఇస్మార్ట్ ప్రభావం చూపలేకపోయింది. ఫస్ట్ డే ఓపెనింగ్స్ ద్వారా బాగానే రాబట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుగులో రూ. 6.10 కోట్లు , కర్ణాటకలో రూ.65 లక్షలు, హిందీలో రూ.50 లక్షలు వసూళ్లు సాధించిందినట్లుగా తెలుస్తోంది.

థియేటర్‌లో సినిమా చూసొచ్చిన ప్రేక్షకులు బాగుందని కాంప్లిమెంట్ ఇచ్చారు. పూరి ఫ్యాన్స్‌కు మాత్రం ఇది ఫీస్ట్ లాంటిదని చెబుతున్నారు. అయితే కొన్ని సీన్లు, డ్రామాను ట్రిమ్ చేస్తే బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో అందరూ వేలెత్తి చూపేది అలీ పాత్ర గురించే. తొలి నుంచి ఈ క్యారెక్టర్‌కు విపరీతమైన హైప్ తీసుకొచ్చారు. పైగా పూరి జగన్నాథ్ సినిమాల్లో అలీకి డిఫరెంట్ రోల్ ఉంటుందని ఆశపడి థియేటర్‌కొచ్చిన వారి సహనానికి ఈ స్టార్ కమెడియన్ పరీక్ష పెట్టారు.

ఎక్కడో అమెజాన్ అడవుల నుంచి వచ్చిన ట్రైబల్ పాత్రలో డిఫరెంట్ లుక్‌తో, ఐ సినిమాలోని ఓ పాటలో విక్రమ్ పోషించిన ఒక వింత మనిషి గెటప్‌ను కాపీ కొట్టినట్లుగా అలీ గెటప్ ఉంది. డబుల్ ఇస్మార్ట్‌లో ఇంట్రడక్షన్ వరకు ఓకే కానీ.. క్రమక్రమంగా అలీ బోర్ కొట్టించాడు. దీనికి తోడు అసభ్యకరమైన సైగలు, వల్గారిటీతో.. ఏదో తన సినిమాల్లో అలీ ఉండాలి కాబట్టి ఇరికించి పెట్టినట్లుగా ఆ రోల్ ఉంది. కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్లు చేసిన అలీకి ఇది చెడ్డపేరు తీసుకొచ్చింది. అందుచేత వెంటనే అలీ కామెడీ సీన్స్‌ని డిలేట్ చేయకపోతే మట్టుకు డబుల్ ఇస్మార్ట్‌కు భారీ డ్యామేజ్ జరుగుతుందని నెటిజన్లు చురకలంటించారు. దీంతో సినిమాను రక్షించేందుకు తన సెంటిమెంట్‌ను పక్కనపెట్టి మరి పూరి జగన్నాథ్ రిస్క్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X