బ్రతికుండగానే...తల్లికి గుడి కడుతున్నాడు

By Srikanya

హైదరాబాద్ : తన తల్లికి గుడి కట్టాలని సంకల్పించారు ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్‌. నవమాసాలు మోసి, జన్మనిచ్చి, పెంచి పెద్దచేసి, ప్రయోజకుడ్ని చేసిన తన తల్లి ప్రేమ, ఆత్మీయతానుబంధాలకు గుర్తుగా బతికుండగానే గుడి కట్టాలని నిర్ణయించానని ఆయన తెలియచేసారు. బుధవారం పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా ఈ బృహత్తర కార్యానికి లారెన్స్‌ శ్రీకారం చుట్టారు.

రాజస్థాన్‌లో లారెన్స్‌ తల్లి కన్మణి విగ్రహాన్ని తయారుచేసే పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది తన పుట్టిన రోజునాడు ఈ గుడి ప్రారంభించనున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో లారెన్స్‌ తెలిపారు. తన తండ్రి స్వస్థలమైన చెన్నై సమీపంలోని మేవలూర్‌కుప్పం గ్రామంలో గుడి నిర్మాణం చేపట్టనున్నారు.

లారెన్స్‌ మాట్లాడుతూ...... ‘అమ్మ లేకపోతే ఈ రోజు నేను భూమిపై ఉండేవాడినే కాదు. మన కళ్లకు కనిపించే దైవమైన అమ్మకు ఆలయం కట్టాలనుకున్నా. నిజానికి అమ్మ మనసే ఓ గుడి. అటువంటి అమ్మ బతికుండగానే ఆమెకు గుడి కట్టి పూజించాలని ఆశపడ్డాను. లోకంలో ఉన్న అమ్మలందరికీ ఈ గుడిని అంకితమిస్తా' అన్నారు. అలాగే అమ్మ గొప్పతనాన్ని తెలియజేసే ఒక పుస్తకాన్ని కూడా గుడితోపాటు ఆవిష్కరించనున్నట్లు లారెన్స్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Director Raghava Lawrence built temple for Mother

ప్రస్తుతం ‘ముని 3: గంగ' చేస్తున్న ఆయన డిసెంబర్‌లో ఓ కొత్త సినిమాను ప్రారంభించనున్నారు. ఈ విషయమై లారెన్స్ మాట్లాడుతూ...‘‘రాఘవేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై డిసెంబర్‌లో ‘ముసలోడు', ‘ది లేటెస్ట్‌' అనే సినిమాలను తెరకెక్కించబోతున్నాను. ఒక్కో సినిమా నిడివి గంట ఇరవై నిమిషాలు ఉంటుంది. ఈ రెండింటిని ఒకే తెరపై చూపిస్తాం. ఇంటర్వెల్‌ వరకు సాగే ‘ముసలోడు' చిత్రంలో నాయికగా ఆండ్రియాను అనుకుంటున్నాం. ‘ది లేటెస్ట్‌'లో లక్షీరాయ్‌ నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నేనే లీడ్‌ రోల్‌ చేస్తున్నాను.

‘‘రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులకు కొత్తదనం అందించడం కోసం ఓ కొత్త ప్రయత్నం చేస్తున్నాను. రెండు విభిన్న కథలతో ఒకే టిక్కెట్‌పై రెండు సినిమాలు చూపించబోతున్నాను'' అని చెప్పారు రాఘవ లారెన్స్‌.

అలాగే...‘స్టైల్‌' సినిమా సమయంలో వెన్నెముకకి చిన్న గాయమైంది. అది ఇప్పుడు ప్రాబ్లమ్‌గా మారడంతో ఐదు నెలలు బెడ్‌ రెస్ట్‌ తీసుకోవల్సి వచ్చింది. అందుకే ‘గంగ' సినిమా షూటింగ్‌కి విరామం కలిగింది. ఇటీవల క్లైమాక్స్‌ షూటింగ్‌ ప్రారంభించాం. మరో ఇరవై రోజుల్లో పూర్తవుతుంది. సీజీ వర్క్‌కి రెండు నెలలు సమయం పడుతుంది. డిసెంబర్‌ 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని వివరించారు.

లక్ష్మీరాయ్‌ మాట్లాడుతూ ‘‘కాంచన చిత్రం తరువాత రాఘవతో నటించనుండటం ఆనందంగా అనిపిస్తోంది. ‘ది లేటెస్ట్‌'లో కొత్త లక్ష్మీరాయ్‌ని చూడబోతున్నారు. ఇందులో పేదింటి అమ్మాయిగా నటింబోతున్నా'' అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X