ఆయన డ్రైవ్ చేస్తూ మరణించారంటే నమ్మలేకున్నా.. రాఘవేంద్ర రావు!
నందమూరి హరికృష్ణ మరణం అందరిని షాక్ కి గురిచేస్తోంది. ఊహించని ప్రమాదంలో హరికృష్ణ మరణించడంతో సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం సంతాపం తెలియజేస్తున్నారు. తాజగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు హరికృష్ణ మృతి పట్ల స్పందించారు.
హరికృష్ణ కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యారంటే తాను నమ్మలేకున్నా. ఎన్టీఆర్ కు రథసారధిగా వేల కిమీ ఆయన ప్రచార రథాన్ని నడిపించారు. అలాంటి వ్యక్తి కారు డ్రైవ్ చేస్తూ మృతి చెందడం దురదృష్టకరం అని రాఘవేంద్ర రావు తెలిపారు.

ఎన్టీఆర్ తో తాను తెరకెక్కించిన డ్రైవర్ రాముడు చిత్రానికి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారని రాఘవేంద్ర రావు గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు కలిసినా అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. హరికృష్ణ కుటుంబ సభ్యులందరితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యలకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నానని రాఘవేంద్ర రావు తెలిపారు.


Click it and Unblock the Notifications











