For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయ స్పీచ్, సుధీర్​ ఫ్యాన్స్​ రచ్చ.. పిచ్చి పిచ్చిగా ఉందా? అంటూ దర్శకేంద్రుడు ఫైర్​

  |

  కొన్నిసార్లు ఫ్యాన్స్ చేసే హంగామా మిగతా హీరోలకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు విసుగు తెప్పిస్తుంది. వారు అభిమానం పేరిట చేసే రచ్చ రోత పుట్టిస్తుంటుంది. ఒక్కోసారి ఇది అభిమానామా? సాడిజమా? అనే డౌట్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 100కు పైగా చిత్రాలను డైరెక్ట్​ చేసిన రాఘవేంద్ర రావు అంటే నేడు ఎంతో మంది డైరెక్టర్లకు ఆదర్శం. అగ్ర హీరోలు, హీరోయిన్లను డైరెక్ట్​ చేసి దర్శకేంద్రుడిగా పేరు పొందారు. ఇటీవల కాలంలో పలు సినిమాలను సమర్పిస్తూ, నటనలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎంత సక్సెస్​ఫుల్​ డైరెక్టర్​ అయినప్పటికీ ఇసుమంత గర్వం కనిపించదు. ఎప్పుడు శాంతంగా, ప్రశాంతంగా చిరునవ్వు చిందించే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి తాజాగా కోపం వచ్చింది. ఏకంగా స్టేజ్​ పైనే వార్నింగ్​ ఇచ్చేంత సీన్​ క్రియేట్​ అయింది.

   ఆ సినిమాల మాదిరిగానే..

  ఆ సినిమాల మాదిరిగానే..


  దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. ''మా వాంటెడ్​ పండుగాడ్​ చిత్రం ఎంటర్​టైన్​మెంట్​ ప్రధానంగా సాగే సినిమా. ఆగస్టు నెలలో విడుదలైన బింబిసార, సీతారామం, కార్తికేయ 2 వంటి సినిమాలు సూపర్​ హిట్​ అయ్యాయి. ఈ సక్సెస్​తో సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది. ఈ చిత్రాల మాదిరిగానే మా మూవీ కూడా విజయం సాధిస్తుంది'' అని ఆశాభావం వ్యక్తం చేశారు.

  ఫ్యాన్స్​ రచ్చను భరించలేక..

  ఫ్యాన్స్​ రచ్చను భరించలేక..

  అనంతరం యాంకర్​ అనసూయ భరద్వాజ్​ మాట్లాడుతుండగా, స్టేజ్​పైకి సుడిగాలి సుధీర్​ వచ్చాడు. అతన్ని చూడగానే సుధీర్​ అభిమానులు అరుపులు, కేకలతో గోల గోల చేశారు. ఈ రచ్చను భరించలేక రాఘవేంద్ర రావు ఆపే ప్రయత్నం చేశారు. స్వయంగా ఆయనే మైక్​ తీసుకుని సుధీర్​ ఫ్యాన్స్​ను వారంచేందుకు ప్రయత్నించారు. అందరు సైలెంట్​గా ఉండాలని కోరారు. అయితే దర్శకేంద్రుడు ఎంత చెప్పినా సుధీర్​ అభిమానులు వినిపించుకోలేదు.

   బయటకు పంపించేస్తా అని వార్నింగ్​..

  బయటకు పంపించేస్తా అని వార్నింగ్​..

  అదంతా చూసిన రాఘవేంద్ర రావు కొద్దిగా అసహనానికి లోనయ్యారు. అప్పటిదాకా ఓపిక పట్టిన ఆయన సుధీర్​ సహా అందరూ మాట్లాడతారని, కాస్త ఓపికతో ఉండాలని చెప్పారు. అయినా వినిపించుకోకుండా రెచ్చిపోయారు సుధీర్​ ఫ్యాన్స్​. దీంతో రాఘవేంద్ర రావుకు చిర్రెత్తుకొచ్చి 'ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? చిన్నా పెద్దా తేడా లేదా? ఎవరు పిలిచారు వాళ్లని? ఇలాగే బిహేవ్​ చేస్తే బయటకు పంపించేస్తా' అంటూ ఫైర్​ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

  నటుడిగా కూడా..

  నటుడిగా కూడా..

  కాగా మొన్నటి వరకు దర్శకత్వంతో ఆకట్టుకున్న రాఘవేంద్ర రావు ప్రస్తుతం సినిమాలను సమర్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇటీవల తనలోని నటుడిని సైతం వెలికి తీసే ప్రయత్నం చేశారు. సీనియర్​ హీరో శ్రీకాంత్​ తనయుడు రోహాన్​ హీరోగా శ్రీలీల జంటగా నటించిన 'పెళ్లి సందD' చిత్రంలో ఓ పాత్రలో రాఘవేంద్ర రావు మెరిసిన సంగతి తెలిసిందే.

  English summary
  Director Raghavendra Rao Gets Serious On Sudigali Sudheer Fans During Anchor Anasuya Speech In Wanted PanduGod Movie Pre Release Event
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X