ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు ట్విట్టర్ ఐడీ ఏమిటంటే..
సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా తన అభిమానులకు దగ్గరయ్యేందుకు ట్విట్టర్ లోకి వచ్చేసారు. రాజమౌళి,రామ్ గోపాల్ వర్మ లాగ కంటిన్యూగా ట్వీట్ చేయటానికి రెడీ అవుతున్నారు. ఆయన ట్విట్టర్ ఐడి ...http://twitter.com/Ragavendraraoba. ఇక ట్విట్టర్ లో ఆయన మొదట తాను త్వరలో త్వరలో షిర్డీ సాయిబాబాపై ఓ చిత్రం చేయబోతున్నానని అన్నారు. ఇక కొద్ది కాలం క్రితం ఆయన తనకు ఇంటర్నెట్,ట్విట్టర్ వంటివి తెలియదని, వాటిని తన ఫ్యామిలీ మెంబర్సే చూస్తారని అన్నారు. అయితే గత కొద్ది నెలలుగా ఆయన ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం, మిగతా ట్విట్టర్ మెసేజ్ లు పరిశీలించటం వంటివి చేస్తున్నారు. దాంతో ఆయన కూడా ట్విట్టర్ లోకి వచ్చేసారు. కాబట్టి ఆయన అభిమానలు వేటగాడులో శ్రీదేవి గురించి ఆయన్ని పలకరించవచ్చు. లేదా ఝుమ్మందినాదంలో పరచయం చేసిన తాప్సీ గురించి తెలుసుకోవచ్చు. పదహారేళ్ళ వయస్సునాటి ముచ్చట్లుని ఆయనకు గుర్తు చేయొచ్చు.


Click it and Unblock the Notifications











