Rashmika Mandanna: రష్మిక మందన్న బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఆ రోజునే స్పెషల్ సర్ ప్రైజ్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కిర్రాక్ పార్టీతో కన్నడంలో ఎంట్రీ ఇచ్చి... తెలుగులో ఛలో సినిమాతో అడుగుపెట్టింది. ఇక పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. గత ఏడాది బాలీవుడ్ లో యానిమల్ చిత్రంతో సూపర్ హిట్టును అందుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే రష్మిక తన బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 5న ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది. భారీ సర్పైజ్ ఇవ్వనుంది. దానితో పాటు తన బాయ్ ఫ్రెండో ఎవరు? పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే సర్పైజ్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
హీరోయిన్ రష్మిక మందన్నా తెలుగులోకి ఛలో సినిమాతో అడుగుపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీగా ఉంది. ఇటీవల రష్మిక యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో అడుగుపెట్టగా.. మొదటి సినిమానే భారీ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమాతో పాటు.. తను డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా పేరు ది గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ షూటింగులో ఇప్పటికే రష్మిక జాయిన్ అయింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో రష్మిక మందన్నాతోపాటు పలువురు పాపులర్ యాక్టర్లు జాయిన్ పాల్గొన్నారట. అయితే ఈ మూవీ గురించి ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది.
రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా అప్‌డేట్ గురించి ఓ అభిమాని రాహుల్ రవీంద్రన్ కు రిక్వెస్ట్ పెట్టగా.. దీనిపై డైరెక్టర్ రియాక్ట్ అయ్యారు. ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ ను రష్మిక బర్త్ డే అయిన ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రేజీ వార్తతో ఇక త్వరలోనే తమ ఫేవరేట్ హీరోయిన్, నేషనల్ క్రష్ ది గర్ల్‌ఫ్రెండ్ టీజర్ రాబోతుందని నేషనల్ క్రష్ అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాలో రష్మిక బాయ్ ఫ్రెండుగా దసరా ఫేం దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు రష్మికకు బాయ్ ఫ్రెండుగా నటిస్తున్నాడు. ఇప్పటికే అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ వీడియో విడుదల చేయగా ఆకట్టుకుంంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ హేశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు..


Click it and Unblock the Notifications











