twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్యామ్ సింగరాయ్ లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్.. మరో పవర్ఫుల్ పాయింట్.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

    |

    నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం శ్యామ్ సింగరాయ్. ఇటీవల కాలంలో నాచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా తన మార్కెట్ ను ఎంతో కొంత పెంచుకోవాలని అడుగులు వేస్తున్నాడు. అయితే వరుసగా రెండు సినిమాలో ఓటీటీలో విడుదల కావడంతో ఎలాగైనా శ్యామ్ సింగరాయ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. ఇక సినిమా ఎలా ఉంటుంది అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు.

    నానికి చెప్పగానే..

    నానికి చెప్పగానే..


    ట్యాక్సీ వాలా సినిమాతో హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ను తనదైన శైలిలో సరికొత్తగా ప్రజెంట్ చేసిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాను మరింత కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యువ దర్శకుడు శ్యామ్ సింగరాయ్ కథ కోసం దాదాపు ఏడాది పాటు కష్టపడి రెడీ చేసుకున్నాడట. ఇక నానికి చెప్పగానే కొన్ని మార్పులు చేసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు.

    ఆ బ్యాక్ డ్రాప్ లో..

    ఆ బ్యాక్ డ్రాప్ లో..

    ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సాయి పల్లవి, కృతి శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమా పూర్తిగా కోల్ కత బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందట. కథలో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అంశాలు కూడా ఉంటాయని దర్శకుడు రాహుల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

    టైమ్ ట్రావెల్..

    టైమ్ ట్రావెల్..

    ఇక సినిమాలో మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే టైమ్ ట్రావెల్ నేపథ్యం కూడా ఉంటుందని అర్ధమవుతుంది.
    ఆధ్యాత్మిక ఫీలింగ్ కలిగి ఉండే పాత్రలతో పాటు అద్వితీయ శక్తులతో హీరో పోరాడే సన్నివేశాలు సినిమాలో ఆసక్తిని రేపుతాయట. ఈ చిత్రం పీరియాడికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని తెలియజేసిన దర్శకుడు ఇందులో ఒక పురాణ ప్రేమకథ కూడా ఉంటుందని అన్నాడు.

    రెండు విభిన్న కాలాలలో..

    రెండు విభిన్న కాలాలలో..


    శ్యామ్ సింగరాయ్ కథ రెండు విభిన్న కాలాలలో కొనసాగుతుందట. ఒక లవ్ స్టొరీ ప్రస్తుత కాలంలో అలాగే మరొకటి 1960లలో కొనసాగే ప్రేమ కథ అని రాహుల్ తెలిపారు. ఇక సినిమాలో VFX మరియు ప్రొడక్షన్ డిజైన్ కూడా కథలో భాగంగా చాలా బాగా వచ్చాయట. నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా సినిమాను నిర్మించేందుకు నమ్మకంతో ముందుకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి.

    Recommended Video

    Lakshya Movie Review || Filmibeat Telugu
    నాన్ థియేట్రికల్ బిజినెస్..

    నాన్ థియేట్రికల్ బిజినెస్..


    శ్యామ్ సింగరాయ్ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా మంచి లాభాలను అందించినట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులను జెమిని టీవీ 10కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక హింది డబ్బింగ్ రైట్స్ ద్వారా సినిమాకు మరొక 10కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక ఓటీటీలో కూడా అంతకంటే ఎక్కివ లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి.

    English summary
    Director Rahul Sankrityan about Shyam Singha Roy story concept
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X