మరో ప్లాన్ కూడా క్యాన్సిల్ చేసుకున్న రాజమౌళి.. RRR షూటింగ్ ఇప్పట్లో లేనట్లే?

దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమాలు చేసినా కూడా మొదట వేసుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్స్ పూర్తి కావని అందరికి తెలిసిందే. ఆయన సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే కనీసం రెండేళ్లు సమయాన్ని తీసుకుంటారని అందరిలో ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే RRR సినిమా విషయంలో కూడా కరెక్ట్ గా అదే జరిగింది. దానికి తోడు కరోనా రావడంతో షూటింగ్ కి మరింత ఆలస్యం అవుతోంది.

సంక్రాంతికి సినిమా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. ఇక సమ్మర్ పై కూడా ఆశలు వదిలేసుకున్నారు జనాలు. కానీ రాజమౌళి లాక్ డౌన్ ఎత్తివేయగానే షూటింగ్ పనులలో స్పీడ్ పెంచాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో టెస్ట్ షూట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఆగస్టు తరువాత ఎలాగైనా సినిమా షూటింగ్ పనులను స్టార్ట్ చేయాలని ఇటీవల మరో ప్లాన్ వేసుకున్నారట.

Director rajamouli another plan cancelled for corona fear

కానీ ప్రస్తుతం కరోనా వైరస్ ల సంఖ్య రోజుకు 28వేలకు పైగా నమోదవుతున్నాయని వెంటనే తన ఆలోచనను మార్చుకున్నారట. షూటింగ్ కోసం 50 మంది టెక్నీషియన్స్ ని మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ అంతకంటే తక్కువ మంది ఉండే సీరియల్స్ లో పాల్గొనేవారికే కరోనా తొందరగా ఎక్కేస్తోంది. ఇక RRR కోసం రోజు 250 మంది అవసరం ఉంటుంది. కాబట్టి రిస్క్ చేయడం ఇష్టం లేక దర్శకధీరుడు మరోసారి వెనుకడుగు వెసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X