రాజమౌళికి చిరాకు తెప్పించినవారిపై చివాట్లు...!
ప్రముఖ దర్శకుడు రాజమౌళి త్వరలో ప్రభాస్ తో ఓ భారీ చిత్రాన్ని రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఇందులో యువనటుడు నితిన్ కి రాజమౌళి ఓ గెస్ట్ రోల్ ఆఫర్ చేసినట్టూ, దానికి నితిన్ వెంటనే ఒప్పుకున్నట్టు ఈమధ్య అదేపనిగా వార్తలొచ్చాయి. టీవీ చానెల్స్ అయితే, ఈ వార్తని బాగా హైలైట్ చేసి చూపాయి. అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదని రాజమౌళి అంటున్నాడు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ లో క్లారిఫికేషన్ కూడా ఇచ్చాడు. 'బాగా పేరున్న గౌరవప్రదమైన ఛానల్స్ కూడా ఎటువంటి ఆధారం లేనటువంటి ఈ వార్తని ఎందుకు ప్రసారం చేస్తున్నాయో నాకర్ధం కావడం లేదు' అంటూ రాజమౌళి చికాకు ప్రదర్శించాడు. ఎందుకో, ఈ వార్త రాజమౌళీని బాగా ఇబ్బందిపెట్టినట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











