రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. అల్లు అర్జున్ స్టన్నింగ్ రిప్లే..
Pushpa 2: ప్రస్తుతం 'పుష్ప 2'హావా నడుస్తోంది. ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో చూసిన.. పుష్ప గాడి రూలింగ్ కొనసాగుతోంది. పుష్ప రాజ్ పై హైప్స్ పెంచేలా పుష్ప 2 ట్రైలర్ ను పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ కు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఈ సమయంలో ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు విషెస్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో పుష్ప 2 ట్రైలర్ పై దర్శక ధీరుడు రాజమౌళి కామెంట్ చేయగా.. అల్లు అర్జున్ స్టాండింగ్ రిప్లై ఇచ్చాడు. ఇంతకీ పుష్ప రాజ్ పై జక్కన్న ఏం కామెంట్ చేశారంటే?
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ - సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబో తెరకెక్కిన ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2'. ఈ మూవీలో అల్లు అర్జున్ హీరోగా నటించగా..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. ఇందులో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. డీఎస్పీతో పాటు తమన్ బ్యాక్ రౌండ్ మ్యూజి అందించారు.

ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న వర్డల్ వైడ్ గా విడుదల కాబోతున్నది. ఇప్పటికే మూవీ కి సంబంధించిన పోస్టర్స్, గ్లిమ్స్, లీక్స్ .. పుష్ప 2 మూవీ పై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ తరుణంలో శనివారం నాడు బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. లక్షలాది బన్నీ ఫ్యాన్స్ మధ్య పుష్ప 2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్ అందుకుని.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇలా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పుష్ప రాజ్ పై మరింత అంచనాలు పెరిగాయి.
అలాగే.. పుష్ప 2 పై ఎక్కడ బజ్ నెలకొంది. ఎక్కడ చూసిన ట్రైలర్‌లోని అంశాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా పుష్ప ట్రైలర్ గురించి మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ పర్ఫామెన్స్ పై చర్చించుకుంటున్నారు. సుకుమార్ టేకింగ్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప ట్రైలర్ పై సినీ ప్రముఖులు, సినిమా రివ్యూస్ స్పందిస్తున్నారు. ఈ తరుణంలో దర్శక ధీరుడు రాజమౌళి కూడా తనదైన స్టైల్ లో స్పందించారు.

డైరెక్టర్ రాజమౌళి తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. 'పాట్నాలో పుష్ప ఫైర్ మొదలైంది.. అది దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది.. డిసెంబర్ 4న విస్పోటనం జరుగుతుంది.. పార్టీ కోసం వెయిట్ చేస్తున్న పుష్ప' అంటూ జక్కన్న ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు .ఈ కామెంట్స్ తో బన్నీ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెరిగింది. సినిమాపై హైప్స్ క్రియేట్ చేసేలా జక్కన్న కామెంట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు.
ఈ సమయంలో డైరెక్టర్ రాజమౌళి ట్విట్ పై.. అల్లు అర్జున్ స్పందించారు. రాజమౌళికి కృతజ్ఞతలు తెలుపుతూ.. తప్పకుండా పార్టీ ఉంటుంది అంటూ ఇంట్రెస్టింగ్ రిప్లే ఇచ్చారు అల్లు అర్జున్. అలాగే అందరికీ పేరుపేరునా అల్లు అర్జున్ థ్యాంక్స్ చెబుతున్నారు.ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పుష్పరాజు కోసం జక్కన్న కూడా వెయిట్ చేస్తున్నాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











