బాహుబలి 3పై కూడా క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి.. ఏమన్నారంటే?
బాహుబలి సినిమా తో ప్రపంచస్థాయిలో గుర్తింపు అందుకున్న దర్శకుడు రాజమౌళి ఇప్పుడు RRR సినిమాతో అంతకుమించి క్రేజ్ అందుకోవడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ మొట్ట మొదటి బిగ్గెస్ట్ మల్టిస్టారర్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. కేవలం తెలుగు భాష లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నెవర్ బిఫోర్ అనేలా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది అని అందరూ నమ్మకంతో ఉన్నారు. అంతే కాకుండా టాలీవుడ్ స్థాయిని కూడా మరో లెవెల్ కు తీసుకు వెళుతుంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు.
రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్లో చిత్ర యూనిట్ చాలా బిజీగా పాల్గొంటోంది. సినిమాను వచ్చే ఏడాది జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న విషయం తెలిసిందే. అయితే సినిమా ప్రమోషన్ లో రాజమౌళికి అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆయన భవిష్యత్తు ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి అన్ని విషయాల్లో కూడా విలేకరులు ఎన్నో సందేహాలను అడుగుతున్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్టు అయితే తప్పకుండా మహేష్ బాబు తోనే ఉంటుంది అని అది కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని చాలా క్లియర్ గా రాజమౌళి వివరణ ఇస్తూ వస్తున్నారు.

అంతేకాకుండా బాహుబలి సినిమా మూడవ భాగం పై కూడా దర్శకధీరుడు ఒక ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చేశారు. తప్పకుండా బాహుబలి లాంటి సినిమా కథను కొనసాగించే అవకాశం అయితే ఉంది అంటూ బాహుబలి సినిమా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చిందనీ అన్నారు. అందులోని పాత్రలు కథనం కూడా మరో సినిమా చేసేందుకు నమ్మకాన్ని కూడా కలిగిస్తాయనీ కచ్చితంగా బాహుబలి మూడో భాగం ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితులలో నేను త్రిబుల్ ఆర్ సినిమా గురించి తప్పితే మరో విషయం గురించి మాట్లాడలేను అని అన్నారు. బాహుబలి 3 గురించి ఇప్పుడు చర్చకు రావడం కరెక్ట్ కాదని కూడా చాలా సింపుల్ గా క్లారిటీ ఇచ్చేశాడు.
ఇంతకుముందు ఈగ సినిమాకు కూడా సీక్వెల్ కూడా ఉంటుంది అని రాజమౌళి తెలియజేశాడు. ఇక ఇప్పుడు బాహుబలి 3 పై కూడా ఒక వివరణ ఇవ్వడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు అయితే రాజమౌళి మాత్రం ప్రస్తుతం మహేష్ సినిమా కోసం మరొక రెండు మూడేళ్లు కష్టపడతాడు అని చెప్పవచ్చు. తర్వాత ప్రభాస్ తో కూడా మరో సినిమా చేసే అవకాశం ఉంది. మరి అది బాహుబలి కి మరొక భాగం అవుతుందా లేక కొత్త ప్రాజెక్టు అవుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. RRR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కు సంబంధించిన ప్లానింగ్ కూడా సిద్ధం అవుతోంది. ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోనే భారీ స్థాయిలో ఒక ప్రీ రిలీజ్ వేడుకకు నిర్వహించాలని అనుకున్నారు. ఆ వేడుకకు ఒక బాలీవుడ్ గెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో అలియా భట్ రామ్ చరణ్ కు జోడీగా నటించగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











