»   » వాళ్లు మెచ్చకపోయినా? వీళ్లు చీ కొట్టినా? రాజమౌళి రూటే సపరేటు (ఫ్లాష్ బ్యాక్)

వాళ్లు మెచ్చకపోయినా? వీళ్లు చీ కొట్టినా? రాజమౌళి రూటే సపరేటు (ఫ్లాష్ బ్యాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏ రంగంలో అయినా గెలుపోటములు సహజం. ఎంత పెద్ద స్టార్ అయినా, ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.....ఏదో ఒక సందర్భంలో అప్ డౌన్స్ ఎదుర్కోక తప్పదు. అయితే గెలుపే తప్ప ఓటమి ఎరుగని కొందరు స్టార్స్ సైతం ఉంటాయి. తెలుగు సినిమా పరిశ్రమలో అలాంటి స్టార్ ఎవరైనా ఉన్నారా? అంటే ప్రతి ఒక్కరి నోట వినిపించే పేరు ఎస్.ఎస్.రాజమౌళి.

ఈ విషయం అందరికీ తెలిసిందే.... ఇపుడు రాజమౌళి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే డౌట్ మీకు రావొచ్చు. కారణం ఉంది కాబట్టే ఇపుడు ఆయన ప్రస్తావన వచ్చింది. రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెం.1 విడుదలైన నేటికి 15 సంవత్సరాలు పూర్తయింది. తెరంగ్రేటం తోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి.... బాక్సాపీసుపై అప్రతిహంగా తన దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు.

వంద కోట్లు కూడా ఊహించని రోజుల్లో...

వంద కోట్లు కూడా ఊహించని రోజుల్లో...

తెలుగు సినిమా పరిశ్రమ రూ. 100 కోట్లు పెట్టుబడిగానీ, అన్ని వసూళ్లు కూడా ఊహించని రోజుల్లో..... రూ. 200 కోట్ల పెట్టుబడితో ‘బాహుబలి' ప్రాజెక్టు మొదలు పెట్టారు రాజమౌళి. అసలు అన్ని కోట్ల పెట్టి సినిమా తీయడమే ఓ సాహసంలా భావించారు చాలా మంది, కొందరు విమర్శలూ చేసారు. కానీ అందరి అంచనాలు తల క్రిందులు చేసారు రాజమౌళి. బాహుబలి తొలి భాగమే దాదాపు రూ. 600 కోట్లకు పైగా వసూలు చేయడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. విమర్శలు చేసిన వారి నోళ్లలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.

వెనక్కి తిరిగి చూస్తే

వెనక్కి తిరిగి చూస్తే

వెనక్కి తిరిగి చూస్తే రాజమౌళి కెరీర్లో అప్పుడే 15 సంవత్సరలు గడిచిపోయింది. ఈ పదిహేనేళ్లలో ఆయన 10 సినిమాలు చేసారు. అన్నీ బ్లాక్ బస్టర్లే. అందులో చాలా వరకు ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిన సినిమాలే.

మేధావులు మెచ్చక పోతే ఏంటి? సీనియర్లు చీ కొడితే ఏంటి?

మేధావులు మెచ్చక పోతే ఏంటి? సీనియర్లు చీ కొడితే ఏంటి?

రాజమౌళి సినిమా అంటే... జనం మెచ్చే సినిమా అనే ముద్ర పడిపోయింది. ఆయన సినిమాల్లో ప్రయోగాలేమీ లేక పోయినా, మేధావులు మెచ్చే అవార్డు సినిమాలు, ఆర్ట్ సినిమాలు, భారీ సందేశాత్మక సబ్జెక్టులు ఆయన టచ్ చేయక పోయినా, ఆ మధ్య కొందరు సీనియర్ యాక్టర్స్ బాహుబలి సినిమా చూసి ఇదీ ఓ సినిమాయేనా అంటూ చీత్కరించినా.... సామాన్య ప్రేక్షకులు, ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకునే వినోదం అందించడంలో రాజమౌళి 100 శాతం సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

రాజమౌళి లాంటి వారు అవసరం

రాజమౌళి లాంటి వారు అవసరం

ఒక సినిమా ఇండస్ట్రీ ఆర్థికంగా నిలదొక్కకోవాలన్నా, నలుగురికి పని దొరకాలన్నా ఆ రంగం లాభాల బాటలో ఉండటం అవసరం. రాజమౌళి తీసే సినిమాలు పరిశ్రమను మరో లెవల్ కి తీసుకుపోయే విధంగా ఉన్నాయి. అంతకంటే పరిశ్రమకు ఇంకేం కావాలి? ఆయన దర్శకత్వంలో వచ్యిన మగధీర, బాహుబలి లాంటి సినిమాలే ఇందుకు నిదర్శనం అని వాదించే వారూ ఉన్నారు.

వరుస విజయాలు

వరుస విజయాలు

తొలి సినిమా స్టూడెంట్ నెం.1 సినిమాతో విజయపరపర మొదలు పెట్టిన రాజమౌళి తర్వాత సింహాద్రి, ఛత్రపతి, సై, విక్రమార్కుడు, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి వంటి సినిమాలతో తెలుగు బాక్సాఫీసును దడదడలాండించాడు.

అదే ఆయన ప్రత్యేకత

అదే ఆయన ప్రత్యేకత

రాజమౌళి సినిమాలన్నీ డిఫరెంటుగా ఉంటాయి. ఎవరో తీసిన సబ్జెక్టును.... మార్పులు చేసి తీయడం ఆయన స్టైల్కాదు. కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరైన ఆయన సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగులు, యాక్షన్ సీక్వెన్సులు విభిన్నంగా ఉంటాయి.

1000 కోట్ల స్థాయికి వెళ్లాలని ఆశిస్తూ...

1000 కోట్ల స్థాయికి వెళ్లాలని ఆశిస్తూ...

బాహుబలి పార్ట్ 1 తో రాజమౌళి సినిమా స్థాయి రూ. 650 కోట్లకు చేరింది. బాహుబలి 2తో ఆయన తెలుగు సినిమా స్థాయిని రూ. 1000 కోట్లకు తీసుకెల్లాలని ఆశిద్దాం.

English summary
SS rajamouli debut movie 'Student No.1' celebrates 15 years today, S S Rajamouli turns nostalgic about it. Although it was 15 years ago that he debuted, it was 25 years ago that he began his journey in films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu