బాలయ్యతో చేస్తున్నారని డ్రాప్ అయ్యాం, మా ఆవిడ వాయించేస్తుంది: రాజమౌళి ఫన్నీ ఆన్సర్స్!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఇటీవల పుత్తూరులో ఓ కాలేజీ ఫంక్షన్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల నుంచి ఆయనకు ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి ఆయన ఆసక్తికరంగా స్పందించారు.

ముఖ్యంగా తన భార్య, కుటుంబం, పిల్లల గురించి అంశాలను కొందరు విద్యార్థులు ప్రశ్నించినపుడు ఆయన ఫన్నీగా సమాధానం ఇచ్చారు. దీంతో పాటు బయోపిక్ తీసే ఆలోచన ఉందా? అనే అంశంపై కూడా స్పందించారు.

బయోపిక్ సినిమాలు తీస్తారా?

బయోపిక్ సినిమాలు తీస్తారా?

ఈ మధ్య కాలంలో చాలా మంది బయోపిక్ చిత్రాలు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా పలానా వ్యక్తికి సంబంధించిన బయోపిక్ చేయాలని అనుకున్నారా? అనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ ‘నాకు ఒక జోనర్లో సినిమా తీయాలని ఎప్పుడూ ఉండదు. ఆ సమయానికి ఏది తీయాలనిపిస్తే అది మొదలు పెడతాను అని రాజమౌళి తెలిపారు.

బాలయ్యతో చేస్తున్నారని డ్రాప్ అయ్యాం

బాలయ్యతో చేస్తున్నారని డ్రాప్ అయ్యాం

బాహుబలి మొదలు పెట్టక ముందు శ్రీకృష్ణదేవరాయల కథ మొదలు పెట్టాం. స్క్రిప్టు వర్క్ చేయడానికి అంతా రెడీ అయింది. కానీ ఈ లోపు మా గురువుగారు రాఘవేంద్రరావు... బాలకృష్ణతో ఆ సినిమా తీస్తున్నారని తెలిసి మేము డ్రాప్ అయ్యాం. తర్వాత మహారాణా ప్రతాప్ చేయాలని కొన్ని రోజులు అనుకున్నాం. కానీ అనుకోకుండా బాహుబలి కథ సెట్టయింది అని రాజమౌళి తెలిపారు.

అలాంటి కథలు చేయాలనిపిస్తాయి

అలాంటి కథలు చేయాలనిపిస్తాయి

నాకు మన రాజుల కథలు చాలా ఇన్ స్పైరింగ్ అనిపిస్తాయి. కృష్ణ దేవరాయలు, రాజ రాజ నరేంద్రుడు, రాజ రాజ చోళుడు, రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ కథలు తీయాలనిపిస్తాయి. అవి చాలా ఎమోషనల్ గా ఉంటాయి.

మా ఆవిడ వాయించేస్తుంది

మా ఆవిడ వాయించేస్తుంది

మీరు ఇంత సక్సెస్ సాధించారు కదా... ఇంత సింపుల్‌గా ఉండటానికి రీజన్ ఏమిటి? అనే ప్రశ్నకు రాజమౌళి రియాక్ట్ అవుతూ... దానికి పెద్దగా రీజన్ ఏమీ లేదు. నేను సింపుల్ గా లేక పోతే మా ఆవిడ వాయించేస్తుంది. మా ఇంట్లో అంతా ఆడోళ్ల పెత్తనం.. మా వది కానీ, మా ఆవిడకానీ ఏ మాత్రం పొగరు చూపినా వాయించేస్తారు. అందుకే చచ్చినట్లు పడుంటాం.. అని రాజమౌళి ఫన్నీ కామెంట్స్ చేశారు.

పిల్లల పెంపకంలో నా పాత్ర తక్కువే

పిల్లల పెంపకంలో నా పాత్ర తక్కువే

పిల్లల పెంపకంలో నా పాత్ర చాలా చాలా తక్కువ. అంతా మా ఆవిడే చూసుకుంటుంది. వాళ్ల ఫ్యూచర్ కు ఏ విధంగా దారులు వేయాలనేది అన్నీ ఆమె డిసైడ్ చేస్తుంది. తండ్రిగా నా బాధ్యత ఏమిటి అంటే నేను చెప్పలేను. వాళ్లతో ఫ్రెండ్లీగా ఉండటానికి ప్రయత్నిస్తాను. పెద్ద గొప్ప తండ్రిని ఏమీ కాదు. లక్కీగా వైఫ్ ఉంది కాబట్టి బ్రతికి పోయాను... అని రాజమౌళి అన్నారు.

గ్రామీణులకు అవకాశాలు కల్పించలేరా?

గ్రామీణులకు అవకాశాలు కల్పించలేరా?

గ్రామీణులకు సినిమా అవకాశాలు కల్పించలేరా?... అనే ప్రశ్నకు రాజమౌళి తనదైన శైలిలో స్పందించారు. ఒక సినిమా తీస్తున్నానంటే ప్రతి ఒక్కరూ కష్టపడినపుడే అది సాధ్యమవుతుంది. నేనేదో రాజసింహాసనం మీద కూర్చుని చిటికేస్తే పనులు అయిపోవు. అలాంటపుడు నేను పని వచ్చినోళ్లు ఎవరు? అని చూస్తాను? వాళ్లు రూరల్ ఇండియా నుంచి వచ్చారా? సిటీ నుంచి వచ్చారా? వాళ్ల బ్యాక్ డ్రాప్ ఏమిటి? వాళ్లు ఏం చదువుకున్నారు? అనేది చూడను. మీరు నా వద్ద పని చేయాలంటే నాకు ఏదైతే కావాలో ఆ పని మీకు వచ్చు అని నిరూపించుకోవడం మీ బాధ్యత.... అని స్పస్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X