డైరెక్టర్ రాజమౌళికి రజియా సుల్తానా అంటే మహా ఇష్టం..!?
నిన్న టీచర్స్ డే సందర్బంగా కొంతమంది సెలబ్రెటీలు తమ, తమ చిన్నానాటి రోజులను గుర్తు చేసుకొటూ వారికి ఇష్టమై టీచర్స్ కు శుభాకాంక్ష లు తెలిపారు అందులో ఒక్కరు మన గ్రేట్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి. ఈ సందర్భంగా కొవ్వూరులో నాలుగో తరగతి చదువుతున్నప్పుడు, తన క్లాస్ టీచర్ అయిన రజియా సుల్తానా అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా రాజమౌళి చెప్పాడు. స్టోరి టెల్లింగ్ విషయంలో తనను ఆమె బాగా ఎంకరేజ్ చేసేదని, ఈ మధ్య ఆమెను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించానని, అయితే కుదురలేదని రాజమౌళి తెలియజేశారు.
రాజమౌళి ప్రస్తుతం నాని హీరోగా 'ఈగ' అనే సినిమా చేస్తున్నాడు. దీని తరువాత ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నం లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలకి మధ్య గ్యాప్ లో బ్రహ్మి తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట.


Click it and Unblock the Notifications











