Rajamouli: 14 ఏళ్ల బాధను బయట పెట్టిన రాజమౌళి.. ఆనంద్ మహీంద్రా అలా అడగడంతో!
తెలుగు చిత్రసీమలో ఓటమి ఎరగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం అనే టీవీ సీరియల్ తో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం నేడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో సినిమా దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి గతేడాది RRR మూవీతో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా తెలుగు చిత్రసీమకు ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చి ఘనత సాధించారు. అయితే తాజాగా జక్కన్న తన 14 ఏళ్ల బాధను బయటపెట్టారు.
ఆస్కార్ తో ముగింపు : తెలుగు చిత్రీసీమలో దర్శక దిగ్గజంగా పేరొందారు రాజమౌళి (SS Rajamouli). ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. ఇక గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా RRR. ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట మొదలై ఆస్కార్ అవార్డుతో ముగిసింది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో RRR మూవీ క్రేజ్ మరింతగా పెరిగింది.

హనుమంతుని పాత్ర : RRRకు ఆస్కార్ రావడంతో రాజమౌళి తర్వాత సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగినట్లుగానే సూపర్ స్టార్ మహేశ్ తో సినిమా ప్లాన్ చేశాడు జక్కన్న. ఆ సినిమానే SSMB29. దీనికోసం రాజమౌళి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర హనుమంతున్ని పోలి ఉంటుందని వార్తలు వినిపించాయి. అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉండనుంది.

ఆ నగరాలు ఏంటీ? : ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఓ ప్రపోజల్ ఉంచి రిక్వెస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత పరాతనమైన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అయిన సింధు నాగరికత నాటి కాలంలో ఉన్న నగరాలు ఏంటీ..? అవి ఎలా ఉండేవో వివరిస్తూ చిత్రాలతో ఒక ట్వీట్ చేశారు ఆనంద్ మహీంద్రా.
రాజమౌళిని ట్యాగ్ చేస్తూ : "ఇలాంటి సింధు నాగరికత కాలం నాటి వర్ణనాత్మక చిత్రాలే చరిత్రకు జీవం పోస్తాయి. మనలోని సృజనాత్మకతను వెలికి తీస్తాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నాటి కాలం గురించి ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి తెలిసేలా ఓ సినిమా తీయగలరేమో చూడండి" అని రాజమౌళిని ట్యాగ్ చేస్తూ ఆనంద్ మహేంద్ర అడిగారు. ఈ ట్వీట్ పై స్పందించిన జక్కన్న మగధీర మూవీ నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.
అనుమతులు రాలేదు : "మేం మగధీర సినిమాను ధోలవిరాలో చిత్రీకరించాం. అప్పుడు శిలాజంగా మారిన ఓ చెట్టును చూశా. సింధు లోయ నాగరికత ఎలా అభివృద్ధి చెందింది? ఎలా అంతరించిపోయింది? అనే దానిపై సినిమా తీస్తే.. అది చెట్టు చెబుతున్నట్లు ఉంటే.. అని ఆలోచన వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పాకిస్థాన్ వెళ్లాను. మోహెంజో దారో వెళ్లి, అక్కడ రీసెర్చ్ చేయాలని ప్రయత్నించా. కానీ అనుమతులు రాలేదు" అంటూ సాడ్ ఎమోజీని పెట్టారు రాజమౌళి.

ఆ కోరిక కూడా : ఇలా సింధు నాగరికత కాలం నాటికి సంబంధించి సినిమా గురించి ఆనంద్ మహేంద్ర అడిగితే.. రాజమౌళి తనకు రాని అనుమతుల గురించి చెబుతూ బాధపడ్డారు. మగధీర వచ్చి సుమారు 14 ఏళ్లు అవుతుంది. అంటే జక్కన్న అలా 14 ఏళ్లుగా ఫీల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కాగా రాజమౌళికి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని తెలిసిందే. ఇదే కాకుండా సింధు లోయ నాగరికత గురించి కూడా అందరికీ చెప్పాలని కోరికగా ఉందని అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











