‘భరత్ అనే నేను’.... డైరెక్టర్ రాజమౌళి, ఇతర సినీతారల రివ్యూ
Recommended Video

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. ఇటు అభిమానుల నుండి, అటు సినీ క్రిటిక్స్ నుండి ఈ చిత్రానికి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈచిత్రం మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా 'భరత్ అనే నేను' సినిమాపై ప్రముఖ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించారు.
అలాంటివి చాలా కష్టం, అయినా అదరగొట్టారు
కమర్షియల్ సినిమాలో లోకల్ గవర్నెన్స్ లాంటి ఇష్యూలను చూపించాలంటే ఎంతో ఆలోచన అవసరం. ఎంతో నమ్మకంతో ఈ సినిమా చేసిన దర్శకుడు కొరటాల శివ, సూపర్ స్టార్ మహేష్ బాబును అభినందించాల్సిందే. సినిమాలో ఎన్నో గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. అందులో ప్రెస్ మీట్ సీన్ మరింత అద్భుతంగా ఉంది అని అని రాజమౌళి తెలిపారు.
మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది
మహేష్ బాబు కెరీర్లోనే ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్. సినిమాకు ఎంచుకున్న తారాగణం కూడా చాలా బావుంది. ప్రతి ఒక్కరూ ఆయా పాత్రలకు పర్ఫెక్టుగా సరిపోయారు. చిత్ర నిర్మాత దానయ్య గారికి, భరత్ అనే నేను బృందానికి కంగ్రాట్స్.... అని రాజమౌళి ట్వీట్ చేశారు.
దర్శకుడు శ్రీను వైట్ల
మహేష్ బాబు తన మైండ్ బ్లెయింగ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ఇంతటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నందుకు టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ దర్శకుడు శ్రీను వైట్ల ట్వీట్ చేశారు.
వంశీ పైడిపల్లి
మహేష్ బాబు తన పాత్రలో జీవించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ స్టన్నింగ్ అనేలా ఉంది. దర్శకుడు కొరటాల శివ ఎంతో నిజాయితీగా స్టోరీ నేరేట్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తనదైన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరుతో అదరగొట్టారు అని. టీమ్ మొత్తానికి అభినందనలు అని దర్శకుడు వంశీ పైడిపల్లి ట్వీట్ చేశారు.
మూవీ బివిఎస్ రవి
భరత్ అనే నేను చిత్రం మహేష్ బాబు కెరీర్లో మరొక మెమొరబుల్ బ్లాక్ బస్టర్. అద్భుతమైన స్క్రిప్టుకు ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, టాప్ డైరెక్షన్ స్కిల్స్ మ్యాచ్ అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ వస్తుంది అని బివిఎస్ రవి తెలిపారు.
అనిల్ సుంకర ట్వీట్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రజలకు ఇచ్చిన ప్రామిస్ ఫుల్ ఫిల్ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ది బెస్ట్ పొలిటికల్ మూవీ. అభిమానులకు సూపర్ స్టార్ ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్. ప్రతి ఒక్కరూ ప్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు.
అనిల్ రావిపూడి ట్వీట్
భరత్ అనే నేను చిత్రంలో చాలా గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. మహేష్ బాబు గ్రేట్ జాబ్. కొరటాల శివ రైటింగ్, ప్రజంటేషన్ నైస్. చిత్ర బృందానకి అభినందనలు అంటూ.... దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











