SS Rajamouli Review మిస్ శెట్టి అనుష్కపై ప్రశంసల వర్షం.. మిస్టర్ పొలిశెట్టి గురించి ఏమన్నారంటే?
దర్శకుడు రాజమౌళి అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఆయన చాలా రోజుల తర్వాత బ్యాక్ బ్యాక్ రెండు సినిమాలు చూశారు. ఈ విషయాన్ని చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి.. వాటిపై ఆయన రివ్యూ ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దర్శకుడు రాజమౌళి చాలా రోజుల తర్వాత రెండు సినిమాలు చూశారు. ఆయన ఈ విషయాన్ని చెబుతూ తన సోషల్ మీడియా ఖాతా నుంచి ట్వీట్స్ చేశారు. రాజమౌళి చూసిన సినిమాల్లో ఒకటి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి నటించిన ఈ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు. పి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాపై రాజమౌళి రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాను చూసిన ఆయన.. అనుష్క ఎప్పటిలాగానే ఈ సినిమాలో అందంగా కనిపించింది. నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్‌తో హాస్యాన్ని, వినోదాన్ని పెద్ద మొత్తంలో అందించాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాకు బృందానికి అభినందనలు. ఇలాంటి సెన్సిటీవ్ సబ్జెక్ట్‌ను కమెడీ వేలో హ్యాండిల్ చేసినందుకు దర్శకుడు మహేశ్ ను ఖచ్చితంగా మెచ్చుకోవాలి అంటూ... ట్వీట్ చేశాడు.
ఇక మరో మూవీ జవాన్ సినిమా కూడా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పఠాన్ లాంటి సినిమా తర్వాత షారుఖ్ నటించిన చిత్రం జవాన్. ఇక ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించగా.. హీరోయిన్ గా నయన తార నటించింది. ఇక ఈ మూవీలో దీపికా పదుకునే, సంజయ్ దత్త్ అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్టైమెంట్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అయితే జవాన్ చిత్రాన్ని చూసిన రాజమౌళి... తన దైన శైలీలో రివ్యూ ఇచ్చారు. తన సోషల్ మీడియా వేదికగా... ఇలాంటి భీభత్సమైన ఓపెనింగ్స్ రాబట్టాడు గనుకే కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ బాద్‌షా అయ్యాడు. నార్త్ లోనూ విజయ పరంపర కొనసాగిస్తున్న దర్శకుడు అట్లీకు అభినందనలు. అద్భుతమైన విజయం సాధించిన జవాన్ బృందానికి అభినందనలు అంటూ జవాన్ సినిమాపై ట్వీట్ లో రాసుకొచ్చాడు.

ఈ గురువారం రిలీజ్ అయిన జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలకు మంచి హైప్ వస్తుంది. వసూళ్లు కూడా తగ్గకుండా వస్తున్నాయి. ఇక రాజమౌళి ట్వీట్ ఈ సినిమాలకు బూస్టప్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి ప్లస్ అవ్వనుంది. ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











