ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి కూడా రాజకీయ ప్రచారంలోకి దూకాడు. అయితే తన హీరోలు ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్న తెలుగుదేశానికో, రామ్ చరణ్ తేజ స్వంత పార్టీ ప్రజారాజ్యానికో సపోర్ట్ చేయటం లేదు. నైతికవిలువలు ఉన్న పార్టీ అంటూ లోక్ సత్తా జెండ్ భుజాన ఎత్తుకున్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లో లోక్ సత్తా పార్టి ప్రచారం నిమిత్తం ఆయన పర్యటించారు. అవినీతిరహిత పాలన రావాలంటే లోకసత్తా వల్లే సాధ్యమవుతుందంటూ పిలుపునిచ్చారు. అయితే జనం నుంచి ఊహించిన విధంగా స్పందన రాకపోవటం కొంత నిరాశపరిచింది. మరో ప్రక్క ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి భవిష్యత్ లో వస్తానని చెప్పటం ఈ రోడ్ షో ఆ మాటలకు ఊతమిచ్చింది. సంగీత దర్సకుడు కీరవాణి, ఆయన భార్య కూడా లోక్ సత్తా పార్టీ తరుపున ప్రచారంలో తిరుగుతున్న సంగతి తెలిసిందే.