Rajamouli: 10 భాగాలుగా మహాభారతం.. డ్రీమ్ ప్రాజెక్ట్‌పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దర్శక దిగ్గజం రాజమౌళినే. అందుకే ఆయన్ను ఓటమెరుగని దర్శక ధీరుడు అంటారు. ఒక బుల్లితెర సీరియల్ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన నేడు తన సినిమాతో ప్రపంచ స్థాయిలో సత్తా చాటారు.
తెలుగు సినిమా ఖ్యాతిని ఖండంతారలు దాటించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో SSMB29 సినిమా తెరకెక్కిస్తున్న ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రాఘవేంద్ర రావు శిష్యుడిగా: దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యుడిగా సినిమా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి ముందుగా సీరియల్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈటీవీలో ప్రసారమైన శాంతి నివాసం అనే సీరియల్ తో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం నేడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో సినిమా దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి గతేడాది RRR మూవీతో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఒక్క ప్లాప్ తీయకుండా: RRRలోని నాటు నాటు పాటకు ఆస్కార్ తీసుకొచ్చి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు రాజమౌళి. ఇక ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రేక్షాకాదరణను పొందాయి. ఇలా తొలి సినిమా నుంచి నేటి RRR వరకు ఏ ఒక్క ప్లాప్ మూవీ తీయకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు.

ఇండియానా జోన్స్ తరహాలో: ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ తో సినిమా ప్లాన్ చేశాడు జక్కన్న. ఆ సినిమానే SSMB29. దీనికోసం రాజమౌళి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర హనుమంతున్ని పోలి ఉంటుందని వార్తలు వినిపించాయి. అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉండనుంది. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచరస్ సినిమాను తీయాలని ఆయనకు కోరిక ఉందని తెలిపారు.

రాని అనుమతులు: ఇదే కాకుండా రాజమౌళికి సింధు లోయ నాగరికత గురించి కూడా చెబుతూ ఓ సినిమా చేయాలని ఉందని ఇటీవల ప్రముఖ వాణిజ్యవేత్త ఆనంద్ మహీంద్రాతో ట్విటర్ వేదికగా పంచుకున్న విషయం తెలిసిందే. మగధీర సమయంలోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం మొహెంజోదారో వెళ్లి రీసెర్చ్ చేయాలని చూస్తే పాకిస్తాన్ అనుమతులు ఇవ్వలేదని ట్వీట్ లో చెప్పుకొచ్చారు.
ఏడాదికంటే ఎక్కువగా: ఇదిలా ఉంటే రాజమౌళి ప్రధానమైన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని తెరకెక్కించడం అని చాలా మందికి తెలిసిన విషయమే. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "దేశంలో అందుబాటులో ఉన్న మహాభారతం అన్ని వెర్షన్లను చదివి.. అర్థం చేసుకోవాలంటేనే కనీసం ఒక సంవత్సరం లేదా అంతకన్న ఎక్కువే పడుతుంది. అలాంటి దాన్ని ఒక ఫీచర్ ఫిల్మ్ గా తెరకెక్కించాలంటే నా గెస్ ప్రకారం కనీసం 10 భాగాలుగా తీయాలి" అని జక్కన్న పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











