SS Rajamouli: జక్కన్నకు అరుదైన గౌరవం.. కీలక పాత్ర పోషించనున్న రాజమౌళి

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక దిగ్గజంగా పేరొందారు రాజమౌళి (SS Rajamouli). ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచాయి. ఇక గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా 'రౌద్రం రణం రుధిరం' RRR. ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట రాగా అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ తో రాజమౌళి పేరు ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. అయితే తాజాగా రాజమౌళికి అరుదైన గౌరవం లభించింది. అది ఏంటి? దాని ప్రాముఖ్యత ఏంటనే వివరాల్లోకి వెళితే..

ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్బీసీ-ISBCకు గౌరవ ఛైర్మన్ పదవిని చేపట్టారు దర్శక ధీరుడు రాజమౌళి. పాఠశాలల స్థాయి నుంచి అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసేందుకు పని చేస్తున్న ఐఎస్బీసీలో గౌరవ చైర్మన్ పదవికి జక్కన్న ఎంపిక అయ్యారు. ఐస్బీసీ మూడంచెల క్రికెట్ పోటీలను నిర్వహిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరిలో ఇండియాలో స్కూల్స్ క్రికెట్ వరల్డ్ కప్ జరగనుంది. ఈ క్రమంలో రాజమౌళికి చైర్మన్ గా కీలక పదవి ఇచ్చి అరుదైన గౌరవం అందించింది ఐసీబీసీ.

Director Rajamouli Selected As Indian School Board For Cricket Honorable Chairman

శనివారం అంటే జూలై 1న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాలను ఐఎస్బీసీ వ్యవస్థాపకుడు, సీఈవో కొలనుపాక సునీల్ బాబు వెల్లడించారు. ఇందులో రాజమౌళి సైతం మాట్లాడారు. "నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

స్కూల్, కాలేజీలో నేను క్రికెట్ ఆడేవాన్ని. ఏలూరులో కాలేజీలో చదువుతున్నప్పుడు క్రికెట్ టీమ్ లో నేను ఆడాను. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్ చాలా ఉంది. కానీ సరైన ప్లాట్ ఫామ్ లేక చాలా మంది వెలుగులోకి రాలేకపోతున్నారు. క్రికెట్ అభివృద్ధికి నన్ను ఐఎస్బీసీ సంప్రదించింది. నేను అంగీకరించాను" అని రాజమౌళి పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఐఎస్బీసీ ప్యాట్రన్ గా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎంపిక కాగా.. రాజమౌళి కుమారుడు కార్తికేయ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇక వచ్చే ఏడాది జనవరిలో స్కూల్స్ క్రికెట్ ప్రపంచకప్ నిర్వహించనున్నారు. ఈ వరల్డ్ కప్ లో 8 దేశాల జట్లు పోటీ పడనున్నాయి. దీనికంటే ముందు దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ స్టేట్, ఇండియన్ స్కూల్ టాలెంట్ లీగ్ (ISTL) జరగనున్నాయి. ఈ ఎస్టీఎల్ లో 8 ఫ్రాంచైజీలు ఆడనున్నాయి. ఈ లీగ్ లో గెలిచిన జట్టు.. స్కూల్ వరల్డ్ కప్ లో భారత్ తరఫున ఆడేందుకు ఎంపికవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X