పుష్ప 2 కి ప్రమోషన్స్ అక్కర్లేదు.. ఆల్ ది బెస్ట్ చెప్పను.. స్టార్ డైరెక్టర్ కామెంట్స్

Pushpa 2: ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప2 విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ -సుకుమార్ ల క్రేజీ కాంబోలో వస్తున్నాయి. పుష్ప మూవీ పై విడుదలకు ముందే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప2 పై స్టార్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

అల్లు అర్జున్ - సుకుమార్ క్రేజీ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 1 కి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 . ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అయినా ఐటెం సాంగ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల మాస్ స్టెప్పులేసింది. అలాగే.. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ, సునీల్‌, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా.. తమన్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ అందించారు.

Director Rajamouli shocking comments on Allu Arjun director Sukumar in Pushpa 2 Pre release Event at Hyderabad

పుష్ప 2 సినిమా విడుదల ముందుకే ముందే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఈ సినిమాను నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, ఐటమ్ సాంగ్స్ కు ఎనలేని రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ మూవీపై ఊహించని రీతిలో ఆదరణ పెరిగిపోయింది. ఈ సినిమా కోసం దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో శాండిల్ వుడ్ స్మగ్లింగ్ బేస్డ్ గా సినిమాను తెరకెక్కించారు. ఈ మోస్ట్ అవైంటెడ్ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్ లలో విడుదల కాబోతుంది.

పుష్ప 2 సినిమా విడుదల తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు నగరాలలో పుష్ప 2 కు సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. తాజాగా హైదరాబాదులో ఈ మూవీ గ్రాండ్ ఫ్రీ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ప్రమోషన్స్ ఈవెంట్ పాల్గొన్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. 'పుష్ప 2 సినిమాకి ప్రమోషన్లు అక్కర్లేదని, యావత్ భారతదేశం పుష్ప సినిమా కోసం వెయిట్ చేస్తుందని చెప్పారు. అంతకన్నా వేరే ప్రమోషన్స్ అక్కర్లేదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Director Rajamouli shocking comments on Allu Arjun director Sukumar in Pushpa 2 Pre release Event at Hyderabad

'తెలుగు సినీ చరిత్రలో నేషనల్ అవార్డు అందుకున్న హీరో అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెరుగుతోందనీ, అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కు ఈ సినిమాతో టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని ఆశించారు. కొన్నిచోట్ల ఈ ఈ సినిమాకు సంబంధించిన టికెట్లను రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్నారని, ఇప్పటికే పలు సినిమాల రికార్డులు బ్రేక్ అయ్యాయని రాజమౌళి అన్నారు. తాను పుష్ప 2లో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ ను చూసానని , ఆ సీన్ గురించి రాజమౌళి వివరించారు.

సుక్కు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉందనీ, ఆ సిన్ ను తాను మొత్తం చెప్పనని, ఆ సీన్ లోని హైలెట్స్ వెల్లడించారు. అందులో సుక్కు డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్షన్ , దేవిశ్రీ మ్యూజిక్ చాలా బాగున్నాయని, వారు తమ బెస్ట్ ఇచ్చారని వెల్లడించారు. ఒక్క సీన్ అలా ఉంటే.. సినిమా మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను బ్రేక్ చేయడం పక్క అంటూ పుష్ప 2 సినిమాపై హైప్స్ క్రియేట్ చేశారు ఎస్ఎస్ రాజమౌళి.

More from Filmibeat

Read more about: rajamouli allu arjun sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X