నిర్మాతలు సినిమాలు ఎందుకు తీస్తున్నారు..రాజమౌళి
'బడ్జెట్ అనేది సినీ నిర్మాణానికి అవసరమైన ఓ సాధనం మాత్రమే. కథకి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవాలి. పెట్టుబడిని తిరిగి రాబట్టుకొనేలా చిత్రాన్ని తీర్చిదిద్దుకోవాలి అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. అలాగే నిర్మాతలు సినిమాలు ఎందుకు తీస్తున్నారు...? ఆ డబ్బును రియల్ ఎస్టేట్‌లోనో, ఫిక్స్‌డిపాజిట్ల రూపంలోనే పెట్టుబడి పెడితే కొన్నాళ్లకు వాటికి రెట్టింపు డబ్బు వస్తుంది కదా...! సినిమా నిర్మాణమంటే ఇష్టం.. అందుకే సినిమాలు నిర్మిస్తున్నారు అని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి.
హైదరాబాద్ లోని మారియాట్ హోటల్‌లో ఫిక్కీ ఫ్రేమ్స్ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమై రెండు రోజుల పాటు మీడియా, వినోద రంగాల వ్యాపార సదస్సు జరిగింది. అందులో మన తెలుగు సినిమా ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి ఇలా స్పందిచారు.
అలాగే అలాగే సూపర్‌హిట్ సినిమాలకు అత్యధిక బడ్జెట్‌లు ఎంత వరకు అవసరం అనే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ.. ఇటీవల అపజయాల పాలైన భారీ చిత్రాలను సదరు నిర్మాతలు.. కథను వినకుండా కేవలం కాంబినేషన్, హీరో మార్కెట్ విలువ చూసుకొని సినిమా లు చేస్తున్నారని ,అందుకే ఫెయిలవుతున్నాయని పేర్కొన్నారు. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తను సినిమా లు చేయనని, తను ఏమీ తీయాలనుకుంటాననో దానిపైనే దృష్టిపెడతానని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











