SS Rajamouli: డియర్ ప్రసాద్.. మీరు నా తరగతి గది.. రాజమౌళి ఎమోషనల్ వీడియో
తెలుగు చిత్రసీమలో ఓటమి ఎరగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది అందరూ చెప్పే ఒకే ఒక్క సమాధానం ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). కానీ, ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా మంచి విజయం సాధించినప్పటికీ సై మూవీ మాత్రం కొందరి డిస్ట్రిబ్యూటర్లకు నష్టం కలిగించిందని ఆయనే ఓసారి తెలిపారు. అయితే మొత్తంగా ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మాత్రం ఆయన్ను మాత్రం అందరూ సక్సెస్ రాజమౌళి అనే అంటారు. శాంతి నివాసం అనే టీవీ సీరియల్ తో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం RRRతో ప్రపంచస్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే ఎంతోమంది సినిమాలు వీక్షించే ఓ వేదికపై రాజమౌళి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.
తెలుగు చిత్రీసీమలో దర్శక దిగ్గజంగా పేరొందారు రాజమౌళి (SS Rajamouli). ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని అమాంతం పెంచేశాయి. ఇక గతేడాది విడుదలై సునామీ సృష్టించిన సినిమా RRR. ఈ సినిమాకు ఆది నుంచే అవార్డుల పంట ప్రారంభం కాగా అత్యున్నత పురస్కారం ఆస్కార్ అవార్డుతో ముగిసింది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో RRR మూవీకి మరింతగా క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే.

RRRకు ఆస్కార్ రావడంతో రాజమౌళి తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటికి తగినట్లుగానే సూపర్ స్టార్ మహేశ్ తో సినిమా ప్లాన్ చేసిన సినిమానే SSMB29. దీనికోసం రాజమౌళి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. ఇందులో మహేశ్ బాబు పాత్ర హనుమంతున్ని పోలి ఉంటుందని, స్టోరీ అంతా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ప్రముఖ హాలీవుడ్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని ఇప్పటికే అనేకమైన కథనాలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ప్రతి ప్రేక్షకుడు సినిమాలు వీక్షించే వేదిక థియేటర్స్. ఓటీటీల హవా ఎలా ఉన్నా థియేటర్ లో చూసే ఫీల్ వేరేలా ఉంటుంది. అలాంటి హైదరాబాద్ లోని ఫస్ట్ మల్టీ ప్లెక్స్ థియేటర్ అయినా ప్రసాద్ ఐమాక్స్ నిర్మించి నేటికి 20 ఏళ్లు గడుస్తుంది. ఈ సందర్భంగా రాజమౌళి ఓ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ గా నోట్ రాసుకొచ్చిన ట్వీట్ చేశారు.
"ఎన్ని శుక్రవారాలు. ఫస్ట్ డే, ఫస్ట్ షోలు, ఉదయాన్నే 8.45 గంటలకు సీట్లలోకి పరిగెత్తుకెళ్లడం. అప్పుడే 20 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. ఇక్కడ విడుదలయ్యే ప్రతి ఒక్క సినిమాతో అయితే ఆనందించా. లేదా నిరాశపడ్డా. కానీ, ప్రతి ఒక్క సినిమా ఏదో ఒక పాఠం చెబుతూనే ఉంది. ప్రియమైన ప్రసాద్... మీరు ఒక సినిమా కాదు. నా క్లాస్ రూమ్. కృతజ్ఞతలు" అంటూ హగ్స్ ఉన్న ఎమోజీలను పెట్టారు రాజమౌళి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











