twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    10 ఏళ్ల క్రితం స్క్రిప్ట్స్‌ పట్టుకొని తిరిగా.. చివరకు సుడిగాలి సుధీర్ అలా..

    |

    'జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా' వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, 'రాజుగారి గది' ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం:1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డిసెంబర్‌ 28న గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు, దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, నటుడు కె.శేఖర్‌ రాజు మాట్లాడుతూ...

     చిత్ర దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ...

    చిత్ర దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ...

    నేను రైటర్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేశాను. నేను కూడా అందరిలాగే 10 సంవత్సరాల క్రితం స్క్రిప్ట్స్‌ పట్టుకొని అన్నీ ఆఫీస్‌లకి తిరిగాను. ఫైనల్‌గా మా గురువుగారు సంపత్‌ నందిగారు ఆయన దగ్గర చాలా సినిమాలకి అసిస్టెంట్‌ రైటర్‌, కో డైరెక్టర్‌గా పని చేశాను. అలాగే పోసానిగారి దగ్గర కొన్ని మూవీస్‌కి వర్క్‌ చేశాను. కోన వెంకట్‌గారి దగ్గర రైటర్‌గా వర్క్‌ చేశాను. రైటర్‌గా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' చిత్రానికి పని చేశాను. అలా దర్శకత్వం చేయాలని మా నిర్మాత శేఖర్‌ రాజుగారికి ఈ కథ చెప్పాను. ఆయన సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు.

    ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌!!

    ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌!!

    ఈ సినిమా సుధీర్‌ ఫ్యాన్స్‌నీ, కామన్‌ ఆడియన్స్‌ని పక్కాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా. ఒక కామన్‌ ఆడియన్‌ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ కోరుకుంటారో అది ఈ సినిమాలో ఉంటుంది. కరెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ మీద చేసిన పాయింట్‌. డెఫినెట్‌గా అందర్నీ ఆలోచింపజేస్తుంది. రెగ్యులర్‌ సినిమాల్లా కాకుండా కమర్షియల్‌లోనే మంచి పాయింట్‌ని టచ్‌ చేస్తూ సినిమా చేశాం.

    సుడిగాలి సుధీర్ నుంచి

    సుడిగాలి సుధీర్ నుంచి

    సుడిగాలి సుధీర్‌ నుండి ఏదైతే కామెడీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారో, దాంతో పాటు సస్పెన్స్‌తో కూడిన థ్రిల్లింగ్‌ అంశాలు ఇందులో ఉంటాయి. ఆడియన్స్‌లో ఆయన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' అని టైటిల్‌ పెట్టాం. ఈ సినిమాకు సుడిగాలి సుధీర్ ఫెర్ఫార్మెన్స్ చాలా ప్లస్ అయింది. వెండితెర మీద ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకొంటుంది అని చిత్ర దర్శకుడు రాజశేఖర్‌ రెడ్డి అన్నారు.

    గద్దర్‌ పాత్ర గుర్తుండిపోతుంది!!

    గద్దర్‌ పాత్ర గుర్తుండిపోతుంది!!

    ఈ సినిమాలో ఒక పాట పాడి నటించి సినిమా చూసి ఆడియన్‌ బయటికి వచ్చాక కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్‌ చేసిన గద్దర్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇటీవల మనకు దూరమైన డా. ఎన్‌. శివప్రసాద్‌గారు ఈ సినిమాలో కథ నచ్చి మంచి క్యారెక్టర్‌ చేశారు. నాజర్‌, పోసాని కృష్ణమురళి, ఇంద్రజ, పృధ్వీ, షాయాజీ షిండే ముఖ్య పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 28న సినిమా గ్రాండ్‌గా విడుదలవుంది. ప్రేక్షకులు తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను``అన్నారు.

    English summary
    Sudigali Sudheer coming as hero with Software Sudheer. He is become emotional while speaking about Pawan Kalyan in this movie promotion.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X