ఆత్మహత్యాయత్నం: రాత్రి ఏం జరిగిందో వివరణ ఇచ్చిన డైరెక్టర్ రాజసింహ
Recommended Video

తెలుగు రచయిత, దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు గురువారం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీ పీపుల్ షాకయ్యారు. ఆయన ముంబైలోని తన గదిలో అపస్మారక స్థితిలో పడిఉండటంతో నిద్రమాత్రలు మింగినట్లు భావించారు. వెంటనే ఈ విషయాన్ని మీడియాకు చేరవేయడంతో పాటు, అపస్మారక స్థితిలో పడిఉన్న అతడి ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వార్త కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. ప్రస్తుతం కోలుకున్న జయసింహ నిన్న రాత్రి ఏం జరిగిందో వివరణ ఇచ్చారు.

హెల్త్ ఇష్యూ వల్లనే అలా జరిగింది
ప్రస్తుతం తాను బావున్నానని, ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు రాజసింహ తెలిపారు. నిన్న రాత్రి హెల్త్ ఇష్యూ వల్లనే అపస్మారక స్థితిలోకి వెళ్లానని, తనకు డయాబెటిక్ ఉందని, షుగర్ వ్యాల్యూస్ ఒక్కసారిగా పెరగడంతో అన్‌కాన్షియస్‌లోకి వెళ్లినట్లు తెలిపారు.

అంతా తప్పుగా అర్థం చేసుకున్నారు
నేను అపస్మారక స్థితిలోకి వెళ్లిన సమయంలో తన పక్కన ఎవరూ లేరు. కొంతసేపటి తర్వాత నా రూముకు వచ్చిన వారు అలా పడి ఉన్న నన్ను చూసి నిద్రమాత్రలు మింగినట్లు భావించారు. ఇపుడు అంతా బావుంది, నా గురించి కంగారుపడ్డవారందరికీ థాంక్స్... అని ట్వీట్ చేశారు.

హైదరాబాద్ వచ్చాక అన్నీ మాట్లాడతాను
రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతాను. తాను ముంబై ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి? అన్ని విషాయల గురించి వెల్లడిస్తానని అని రాజసింహ తెలిపారు.
రాజసింహ సినిమాలు
తెలుగు హిట్ మూవీ బొమ్మరిల్లుతో పాటు బోని, కాళిదాసు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహ రచయితగా పని చేశారు. దర్శకుడు కావాలనే తన కలను నిజం చేసుకుంటూ ‘ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. 2016లో విడుదలైన ‘ఒక అమ్మాయి తప్ప' మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దీంతో రాజసింహకు అవకాశాలు తగ్గిపోయాయి. అప్పటి నుండి ఆయన డిప్రెషన్లో ఉన్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











