twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నూతన దర్శకుడికి ప్రతిభా పురస్కారాలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'హమ్-తుమ్' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన దర్శకులు రామ్ భీమన. మొదటి చిత్రంతోనే వైవిధ్యమైన గుర్తింపుని తెచ్చుకోవడంతో పాటూ ప్రతిభా పుసరస్కారాల్ని అందుకోవడం విశేషం. లండన్‌లో మేనేజ్మెంట్ స్టడీ చేసిన రామ్ భీమన, అక్కడి లండన్ ఫిల్మ్ అకాడమీలో దర్శకత్వ కోర్సుని కూడా పూర్తిచేశారు. అక్కడే రెండు ఇంగ్లీష్ చిత్రాలకు పనిచేసి, 'అయామ్ డెడ్' అనే సినిమాలో నటించిన తరువాత భారతదేశానికి వచ్చారు.

    హైదరాబాద్ వచ్చాక ASL PLZ అనే లఘుచిత్రంతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎన్నో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అభినందనలు, అవార్డులు అందుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పటికి యూట్యూబ్ లో మూడుకోట్ల వ్యూస్ దాటింది. ఒక తెలుగు షార్ట్ ఫిల్మ్ ఇంత పాప్యులర్ అవడం చాలా అరుదు.

    Director Ram bhimana got national award

    ఈ మధ్యనే దర్శకుడు రామ్ భీమనకు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి డెబ్బయ్యవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చిన ప్రతిభా అవార్డు వరించింది. షార్ట్ ఫిల్మ్ నుంచీ ఎదిగి సినిమా తీసిన యువదర్శకులను ప్రోత్సహించడానికి ఎర్పాటుచేసిన ఈ అవార్డును అందుకున్న మొదటి వారిలో రామ్ ఒకరు. దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు, హీరో మోహన్ బాబు చేతులమీదగా ఈ అవార్డుని అందుకున్న రామ్ కి దాసరి గారు ప్రత్యేక ఆశీర్వాదాలు అందించడం విశేషం.

    'అంకురం' అనే సామాజిక సంస్థను స్థాపించి బాధ్యతాయుతమైన పౌరులతో కలిసి సేవాకార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న రామ్ ని ఈ నెలలో సూర్యకాంతి జాతీయ పురస్కారం వరించింది. జాయినింగ్ హ్యాండ్స్ ఫర్ హెల్పింగ్ సొసైటీ వారు స్థాపించిన ఈ అవార్డును అనంతపురం పట్టణ జిల్లా పరిషత్ చైర్మెన్ శ్రీ చనమ్ గారు మరియు మేయర్ శ్రీమతి స్వరూప గారి చేతుల మీదుగా లభించింది.

    ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువనవ దర్శకుడికి ఈ పురస్కారాలు ఉత్సాహాన్ని అందించి, పుంజుకున్న స్ఫూర్తితో మరిన్ని మంచి చిత్రాల్ని అందిస్తాడని ఆశిద్దాం. ప్రస్తుతం ఒక భారీ కమర్షియల్ సినిమా స్క్రిప్టుతో సిద్దమౌతున్నాడు రామ్ భీమన.

    English summary
    Tollywood Director Ram bhimana got national award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X