For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుమంత్ రెండో పెళ్లి.. అబద్దమని తెలిశాక మరింత ఘాటుగా స్పందించిన ఆర్జీవి.. నిజాలు తెలుసుకోండి అంటూ..

  |

  విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కాంట్రవర్సీ క్రియేట్ అయినా కూడా తనదైన శైలిలో కామెంట్ చేసి వాటిపై ఎదో ఒక రకంగా మరింత కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే విధంగా కామెంట్స్ చేస్తుంటారు. విషయం మంచిదైనా చెడ్డ దైనా సరే లాజిక్స్ తో ఆలోచింపజేస్తారు. ఇక ఇటీవల సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అనగానే కాస్త షాక్ అయిన వర్మ ఇష్టం ఉన్నట్లుగా నీ ఖర్మ అంటూ సెటైర్ వేశాడు. ఇక అవన్నీ అబద్ధం అంటూ సుమంత్ ఆన్సర్ ఇవ్వగానే మళ్ళీ ఆర్జీవి తన వివరణ ఇచ్చారు.

  రెండో పెళ్లి గోల

  రెండో పెళ్లి గోల

  ఇటీవల సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ రెండో పెళ్లి చేసుకోవాడానికి సిద్దమైనట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. పెళ్లికి సంబంధించిన కార్డ్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యింది. దీంతో చాలామంది అది నిజమని అనుకున్నారు.

  పెళ్లంటేనే నూరేళ్ళ పెంట

  పెళ్లంటేనే నూరేళ్ళ పెంట

  ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నిజమని అనుకున్నారు. ఒకసారి మ్యారేజ్ అయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా? నీ ఖర్మ.. ఆ పవిత్ర ఖర్మను అనుభవించండి.. ఆనేశాడు. అంతే కాకుండా పెళ్లంటేనే నూరేళ్ళ పెంట అయితే.. రెండో పెళ్లి ఏంటయ్యా స్వామి అంటూ.. నా మాట విని మనెయ్యి. పవిత్ర గారు మీ జీవితాలను పాడు చేసుకోకండి. తప్పు మీది కాదు. సుమంత్ ది కాదు. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్తది.. అని వర్మ షాక్ ఇచ్చేలా ట్వీట్ చేశాడు.

  అందులో ఎలాంటి నిజం లేదని అంటూ

  అందులో ఎలాంటి నిజం లేదని అంటూ

  రామ్ గోపాల్ వర్మ సుమంత్ ను సైతం ట్యాగ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక రోజు అనంతరం సుమంత్ ఆ ట్వీట్ పై స్పందించడం విశేషం. అందులో ఎలాంటి నిజం లేదని అంటూ.. మళ్ళీ మొదలైంది సినిమా కోసం సిద్ధం చేసిన వెడ్డింగ్ కార్డ్ లీక్ అవ్వడంతో అందరూ పొరపాటుగా అర్థం చేసుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

  ఓకే సార్ అంటూ వర్మ రెస్పాన్స్

  ఓకే సార్ అంటూ వర్మ రెస్పాన్స్

  ఇక ఇది కావాలని చేసిన ప్రమోషన్ స్టంట్ అంటూ ఓ వర్గం నెటిజన్లు బాగానే ట్రోల్ చేస్తున్నారు. ఇక వర్మ సుమంత్ చెప్పిన మాటలకు స్పందించారు. ఒకే సర్, సినిమా కోసం రూమర్స్ క్లియర్ చేసినందుకు దేవుడికి మరియు డెవిల్ కు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరూ మల్లి మొదలైంది సినిమా చూడాలని అలాగే యాదృచ్ఛికంగా నరకంలో జరిగిన వివాహాల గురించి కఠినమైన వాస్తవాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నట్లు.. పేర్కొన్నారు.

  మొదటి సినిమా ఆర్జీవితోనే

  మొదటి సినిమా ఆర్జీవితోనే

  ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు అక్కినేని వారితో చాలా సాన్నిహిత్యం అయితే ఉంది. సుమంత్ తో కూడా ఆర్జీవి డైరెక్ట్ చేసిన ప్రేమకథ అనే సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. విడుదలకు ముందు భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేసిన ఆ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

  Prabhas పై Mission Impossible 7 Director కామెంట్స్, రూమర్స్ కి చెక్ || Filmibeat Telugu
  ఆమెతో విడాకులు

  ఆమెతో విడాకులు

  ఇక 2004లో సుమంత్ తొలిప్రేమ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఈ హీరో కొన్ని కారణాల వలన రెండేళ్లకే విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి కెరీర్ చాలా ఫోకస్ చేశాడు. అయినప్పటికీ పెద్దగా మార్పులు ఏమి రాలేవు ఎలాంటి ప్రయోగాలు చేసినా కూడా అతనికి కలిసి రాలేదు. ఇక ఆర్జీవి ప్లాప్ ఇచ్చినప్పటికీ అతనితో సుమంత్ కు మంచి స్నేహం ఉంది.

  English summary
  It is common for sensational director Ram Gopal Varma to go viral. RGV has also responded in its own style as various news on Akkineni hero Sumanth's wedding are going viral right now.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X