పుట్టినరోజున షాకింగ్ న్యూస్: రామ్ గోపాల్ వర్మ ఎవరూ ఊహించని నిర్ణయం!
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు తన 57వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఎప్పటి లాగే ఈ పుట్టినరోజు జరుగుతుంది.. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు కానీ.. ఈ బర్త్ డే సందర్భంగా ఆర్జీవీ తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ అయింది.
ఇప్పటి వరకు తెర వెనక ఉండి దర్శకుడిగా రాణించిన ఆర్జీవీ త్వరలో నటుడిగా తెరంగ్రేటం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లు ఆయన డైరెక్షన్ మాత్రమే భరించిన ప్రేక్షకులు, ఇకపై అతడి యాక్టింగును కూడా భరించాలన్నమాట.

వర్మ నటించబోయే సినిమా ‘కోబ్రా'
‘కోబ్రా' అనే సినిమాలో రామ్ గోపాల్ వర్మ నటుడిగా తెరంగ్రేటం చేయబోతున్నాడు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌కు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి టైటిల్ మాత్రమే బయటకు వచ్చింది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

కోబ్రా
‘కోబ్రా' చిత్రాన్ని ‘గన్ షాట్ ఫిల్మ్స్' బేనర్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో వర్మ నటించడంతో పాటు డైరెక్షన్ కూడా చేస్తారట. అయితే ఇందులో ఆర్జీవీ లీడ్ రోల్ చేస్తారా? లేక ఏదైనా చిన్న పాత్రలో కనిపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

వర్మ వాయిస్ ఓవర్‌కు డిమాండ్
ఈ మధ్య పలు చిత్రాలకు రామ్ గోపాల్ వర్మ వాయిస్ ఓవర్ ఇచ్చారు. వాటికి మంచి స్పందన వచ్చింది. ఇక నటనలో వర్మ టాలెంట్ ఏమిటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆర్జీవీ తీసుకున్న నిర్ణయంపై అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

లక్ష్మీస్ ఎన్టీఆర్
ఇక రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి స్పందస సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉందని, ఎన్నికలపై ప్రభావం ఉంటుందని కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల ఆగిపోయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











