Ram Gopal Varma: 3 నెలల జైలుశిక్ష.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన‌ రామ్ గోపాల్ వ‌ర్మ‌

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు,నిర్మాత రామ్ గోపాల్ వర్మకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. చెక్‌బౌన్స్ కేసు(Check Bounce Case)లో రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు ఆయనకు 3 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆర్జీవికి ఆర్థిక వ్యవహారాల కేసులో శిక్షవిధించడం బాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారనే వివరాల్లోకి వెళితే..

వివరాల్లోకెళ్తే.. 2018లో శ్రీ కంపెనీ యజమాని మహేశ్‌చంద్ర మిశ్రా వ్యక్తి ఆర్జీవీపై RGVపై ఫిర్యాదు చేశారు. దీంతో డైరెక్టర్ వర్మపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన ముంబాయిలోని అంధేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు(Andheri Magistrate Court) .. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ లోని సెక్షన్ 138 ప్రకారం రామ్ గోపాల్ వర్మను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఫిర్యాదుదారుడికి మూడు నెలల్లోగా రూ. 3.72 లక్షల పరిహారం చెల్లించాలని, లేదంటే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు ఆర్జీవీని ఆదేశించింది. అలాగే.. వర్మపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష విధిస్తామని కోర్టు హెచ్చరించింది.

Director Ram Gopal Varma Clarifies on Cheque Bounce Case

ఈ కేసుపై తాజాగా రామ్ గోపాల్ వర్మ 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు.' నా మీద అంధేరి కోర్టు శిక్ష విధించిన కేసు వివరాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది ఏడేళ్ల క్రితం నా మాజీ ఉద్యోగికి సంబంధించిన రూ.2.38 లక్షల చెక్ బౌన్స్ కేసు. ఈ కేసులో ఇప్పటికే నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున దీని గురించి ఇంతకుమించి ఏమీ చెప్పలేను' అని ఆర్జీవీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X