నా భార్య 5 గంటలకు నిద్ర లేపి.. ఆ పని చేయమని బలవంతం పెట్టేది !

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్జీవీ ఏం చేసినా.. ఏం మాట్లాడినా..అది సెన్సేషనలే. మొత్తానికి ఆయన వివాదాలకు కేరాఫ్ గా మారిపోయారు. ఒకప్పుడు సినీ లవర్స్ కు హిట్ మూవీ అందించారు ఆర్జీవీ. కానీ, గత కొన్ని సంవత్సరాలు తనకు ఇష్టం వచ్చినట్టు.. సినిమాలు తీస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదోక పోస్ట్ పెట్టి అగ్గి రాజేస్తారు. ఇలా ఎల్లప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటుంటారు ఈయన. తాజాగా రామ్ గోపాల్ వర్మ తన భార్య, కూతురు గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు 'శివ' లాంటి బ్లాక్ బస్టర్ మూవీని అందించారు. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీలోని పలు రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ బిగ్ బీ అలాంటి పెద్ద యాక్టర్ తో సంచలన సినిమాలు తీశాడు. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అందించిన వర్మ ఆ తరువాత ప్రేక్షకుల మనసు నచ్చేలా సినిమాలు తీయడంలో ఫెయిల్ అవుతున్నారు. సీనియర్ హీరోలు, రాజకీయ నాయకుల బయోపిక్ లు తెరకెక్కిస్తూ వార్తలో నిలుస్తున్నారు. అలా వరుస ఫ్లాపులు అందుకోవడంతో వర్మ గ్రాఫ్ పడిపోయింది.

Director Ram Gopal Varma comment on his wife daughter oid interview video viral

రామ్ గోపాల్ వర్మ తన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర కాకపోతున్నా.. పలు సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇస్తూ జనాల్లో నాలుకల్లో నానుతునే ఉన్నారు. ఇంటర్వ్యూలో ఏదోక సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఇంటర్య్వూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. తన భార్య, కుతూరుపై కామెంట్స్ చేశారు. తన భార్య తనకు నచ్చని కొన్ని పనులు చెప్పి తనని ఇబ్బంది పెట్టేదని, అందులో ఉదయం 5 గంటలకు నిద్రలేపి పాల బూత్ కి వెళ్లి పాల ప్యాకెట్లు తీసుకురమ్మని ఇబ్బంది పెట్టేది. అయితే, ఆ విషయం అసలు నచ్చేది కాదని, కావాలంటే తనని వెళ్లి తెచ్చుకోమని చెప్పేవాడిని తెలిపారు.

ఐదు గంటలకు నిద్రలేచి కాఫీ తాగడం కంటే.. మరో రెండు గంటలు పడుకొని రెస్ట్ తీసుకోవడం మేలని నేను భావిస్తాను. అందుకే తనకు జరగాలి ఇవ్వడం ఇష్టం లేదంటూ ఆర్జీవి వెల్లడించారు. ఇదెలా ఉంటే.. శివ మూవీ సినిమా టైంలో తనకు కూతురు పుట్టిందని, ఆ సమయంలో మూవీ మేకర్ కోదండరామిరెడ్డి తన దగ్గరికి వచ్చి తనకు కంగ్రాట్స్ చెప్పారని తెలిపారు. అయితే మూవీ సక్సెస్ అయినందుకు తనకు కంగ్రాట్స్ చెప్పారని మొదలు భావించాలని, కానీ కూతురు పుట్టిందని కంగ్రాట్స్ చెప్పారంటూ తెలిపారు అయితే అప్పటివరకు పిల్లలు పుడితే కంగ్రాట్స్ చెప్తారని విషయం కూడా తనకు తెలియదని, ప్రతి వ్యక్తికి ఆ సామర్థ్యం ఉంటుంది అలాంటప్పుడు దాంట్లో ప్రత్యేకంగా కంగ్రాట్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు.

Director Ram Gopal Varma comment on his wife daughter oid interview video viral

అలాంటి విషయాలలో కంగ్రాట్స్ చెప్పడం అవసరం లేదని, అయితే తన లాంటి హస్బెండ్ దొరికినందుకు తన భార్య, తనలాంటి సెల్ఫ్ సెంటర్ తండ్రి దొరకడం వారి దురదృష్టం, నేను ప్రతి విషయాన్ని సెల్ఫ్ సెంటర్ గా ఆలోచిస్తానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది ఏమైనా ఆర్జీవి సినిమాలే కాదు.. ఆయన ఆలోచన విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే.

More from Filmibeat

Read more about: ram gopal varma rgv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X