twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మా..! ఒలింపిక్స్ విన్నర్ సింధూ ని కూడా వదలవా సామీ..!? ఏమిటా మాటలు

    |

    ఎప్పుడూ వివాదాద‌స్ప‌ద కామెంట్స్ తో హ‌ల్ చ‌ల్ చేసే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఈ సారి ఒలింపిక్స్ పై ప‌డ్డాడు. ఒక్క ర‌జ‌త ప‌త‌కం వ‌చ్చినందుకే ఇంత హంగామా చేయాలా అంటూ పరోక్షంగా తెలుగు తేజం సింధు పై సెటైర్లు వేశాడు. 120 కోట్లు మంది జనాభా ఉన్నదేశంలో ర‌జ‌త ప‌తకం వ‌చ్చినందుకు మేరా భార‌త్ మ‌హాన్ అంటూ నానా హంగామా చేస్తున్నార‌ని , మ‌రి 46 బంగారు ప‌త‌కాలు సాధించిన అమెరికా ఇంకెంత హంగామా చేయాల‌ని వ‌ర్మ ప్ర‌శ్నించాడు.

    వర్మ

    వర్మ

    దర్శకుడు వర్మ కంటే ఎక్కువ వివాదాలా వర్మ, సెటైర్ల వర్మ గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటున్న రామ్ గోపాల్ వర్మ ఈ సారి ఒలింపిక్స్ పై స్పందించాడు. కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న ట్విట్టర్ కు పని చెప్పాడు.

    రామ్ గోపాల్ వర్మ

    రామ్ గోపాల్ వర్మ

    ఈ సారి రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాటలు చాలా వరకూ ప్రజలకు కనెక్ట్ అయ్యేలానే ఉన్నాయి. ఎందుకంటే అవి చాలా వరకూ వాస్తవాలే కనుక..

    ఒలింపిక్స్‌

    ఒలింపిక్స్‌

    ఈసారి ఒలింపిక్స్‌ లో భారత ప్రదర్శన మీద సెటైర్లు వేశారు. 32 కోట్ల జనాభా మాత్రమే ఉన్న అమెరికాకు 46 బంగారు పతకాలు వస్తే, 5 కోట్ల జనాభా మాత్రమే ఉన్న దక్షిణ కొరియాకు 9 బంగారు పతకాలు వచ్చాయని.., అయితే 120 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత దేశానికి మాత్రం ఒకే ఒక్క రజత పతకం వచ్చిందని ఎద్దేవా చేశారు.

    రజత పతకం

    రజత పతకం

    ఒక్క రజత పతకం వచ్చినందుకే మనం ‘మేరా భారత్ మహాన్' అని అరుస్తూ పైకి, కిందకు ఎగురుతుంటే.. 46 బంగారు, 37 వెండి పతకాలు వచ్చిన అమెరికన్లు ఇంకెంత ఎగరాలంటూ ప్రశ్నించాడు.

     5 కోట్ల జ‌నాభా

    5 కోట్ల జ‌నాభా

    కేవలం 5 కోట్ల జ‌నాభా ఉన్న ద‌క్షిణ కొరియా 9 బంగారు ప‌త‌కాలు సాధించింద‌ని, 32 కోట్ల జ‌నాభా ఉన్న అమెరికా 46 బంగారు ప‌త‌కాలు సాధించింద‌ని ఆ లెక్క‌న 120 కోట్ల జ‌నాభా ఉన్న మ‌న దేశం ఎన్ని ప‌త‌కాలు సాధించాల‌ని ఆయ‌న ట్విట్ట‌ర్ లో వెల్ల‌డించాడు.

    త‌ప్పేముంది

    త‌ప్పేముంది

    ఒక విధంగా చూస్తే రామ్ గోపాల్ వ‌ర్మ అన్న‌దాంట్లో త‌ప్పేముంది అని కొంద‌రు ఆయ‌న్ను స‌పోర్ట్ చేస్తున్నారు. ఒక ర‌జ‌త ప‌త‌కాన్ని ఇంత హంగామా చేసే స్థితిలో మ‌న క్రీడ‌లు ఉన్నాయ‌ని కొంద‌రు నెటిజ‌న్లు విచారం వ్య‌క్తం చేశారు.

    భవిష్యత్

    భవిష్యత్

    అయితే వచ్చిన దానికి సంతోష పడి..భవిష్యత్ లో మరిన్ని పతకాల కోసం ట్రై చేయటం తప్పు కాదు కదా? అంటున్నారు అభిమానులు.

    బ్రెజిల్‌లోని

    బ్రెజిల్‌లోని

    బ్రెజిల్‌లోని రియో డి జెనిరోలో ముగిసిన ఒలింపిక్స్‌లో భారత దేశం ఒక రజత పతకం, ఒక కాంస్య పతకంతో మొత్తం పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

    క్రీడల్లో

    క్రీడల్లో

    ఈ క్రీడల్లో మొత్తం 207 దేశాల తరఫున 11,544 మంది పాల్గొన్నారు. భారత దేశం నుంచి అత్యధికంగా 118 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

    వందకు

    వందకు

    ప్రతీ ఏటా వందకు పైగా క్రీడాకారులను పంపటం ఒకటీ రెండూ పతకాలకే మురిసిపోవటం, ఒకే విభాగం లో ఒకే క్రీడాకారుడు ఇప్పటివరకూ రెండో మెడల్ గెలవలేదు..

    ఒలింపిక్ మెడల్

    ఒలింపిక్ మెడల్

    ఒక్కసారి ఒలింపిక్ మెడల్ వచ్చిందంటే ఇక వారికి ఇచ్చే బహుమానాలే కోట్లలో ఉంటున్నాయి తప్ప క్రీడా అకాడెమీలకూ.., పల్లెల్లో ఉన్న బడుల్లో సౌకర్యాల కల్పనా విషయాల్లో ఏ మార్పూ ఉండదు... కనీసం టయిలెట్లే లేని బడుల్లో కనీస సధుపాయాలకి నోచుకోని ఎందరో సింధులు చీకట్లోనే ఉండిపోతున్నారు.

    English summary
    Director Ram Gopal Varma always throws satires at issues and he repeated the same in the case of Olympic medals as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X