twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెరీర్ లోనే మొదటిసారి అలాంటి కథను టచ్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ

    |

    విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా గతంలో ఎప్పుడు ట్రై చేయని విదంగా ఉంటుందని చెప్పవచ్చు. వీలైనంత వరకు ధైర్యంగానే డిఫరెంట్ కథలను టచ్ చేస్తుంటారు. వివాదం ఎంత ఉంటే అంత పబ్లిసిటీ అనే కాన్సెప్ట్ తోనే కాంట్రవర్సీ కథలను టచ్ చేస్తుంటాడు. మొదటి సినిమా నుంచి కూడా వర్మ ఎవరు చేయని ప్రయోగాలు చేస్తున్నాడని చెప్పవచ్చు.

    కరోనా టైమ్ లోనే ఎవరు షూటింగ్స్ చేయని పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసి షాక్ ఇచ్చాడు. ఇక ఓటీటీ బిజినెస్ పై కూడా ఎవరు ఊహించని విధంగా ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. ఆ మధ్య బోల్డ్ కంటెంట్స్ తో ఓ వర్గం వారికి షాక్ ఇచ్చాడు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. వర్మ తన కెరీర్ లో ఇప్పటివరకు టచ్ చేయని జానర్ ను మొదటిసారి టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    Director ram gopal varma first time planning on science fiction film

    సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆర్జీవి ఇంతవరకు ఎలాంటి సినిమా చేయలేదు. ఇక మొదటిసారి ఆ జానర్ ను టచ్ చేయడానికి రెడీ అవుతున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చేశాడు. గతంలో న్యూక్లియర్ బాంబ్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేసిన వర్మ ఆ తరువాత ఎందుకో మళ్ళీ అటువైపు వెళ్లలేదు.

    ఇక ప్రస్తుతం స్పార్క్ అనే ఓటీటీ సంస్థను ఎలాగైనా జనాల్లోకి మరింత లోతుగా తీసుకు వెళ్లాలని వర్మ గట్టి ప్లాన్ అయితే వేసినట్లు సమాచారం. అందులోనే కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వనున్నాడు. ఇక వర్మ టచ్ చేయబోయే కొత్త జానర్ ఎంతవరకు క్లిక్కవుతుందో చూడాలి.

    English summary
    Director ram gopal varma first time planing on science fiction film. Typical director Ram Gopal Varma is coming up with another different film. RGV, which is intimidating with crime thriller stories as well as horror movies, is coming up with a ghost story after a long time. It's been a long time since a horror movie came out of this director.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X