RGV: కుక్కల దాడిలో మరణించిన పిల్లడి ఫ్యామిలీకి అండగా ఆర్జీవి.. గ్రేట్ వర్క్.. మీరు మారిపోయారు సార్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటారు అనేది అందరికి తెలిసిందే. ఆయనపై ప్రశంసలు విమర్శలు కామన్. అలాగే ఆర్జీవీ అంటే అడల్ట్ సినిమాలు, అనవసరమైన కాంట్రవర్సీలకు బ్రాండ్ అని అంటుంటారు. అయితే అలాంటి ఆర్జీవీలో హ్యూమన్ యాంగిల్ కూడా ఉందని కొన్ని సంఘటనలతో ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి ఘటనపై ఆర్జీవి రియాక్ట్ అయిన విధానం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఆయన ఆ ఫ్యామిలీకి సహాయం చేసేలా అందరిని ప్రేరేపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అందాలని ఆరాధించడమే కాదు..

అందాలని ఆరాధించడమే కాదు..

అమ్మాయిల అందాలని ఆరాధించడమే కాదు సమాజంలో జరిగే అనాగరిక వ్యవహారాలపై కూడా ఆర్జీవీ స్పందిస్తూ తనలోని మానవత్వాన్ని నిరూపించుకుంటూ ఉంటారు.
ఆ మధ్య ఓ అమ్మాయిని నగ్నంగా చేసి కొంత మంది యువకులు దాడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దానిపై ఆర్జీవీ రియాక్ట్ అయ్యి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 కుక్కల దాడిపై..

కుక్కల దాడిపై..

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం తెలంగాణలో హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే చిన్నారి బాలుడు మృతి చెందాడు. తండ్రితో కలిసి కారు షెడ్ కి వెళ్ళిన ఆ చిన్నారి బాలుడుని వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేసి కరిచేశాయి. ఈ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఆర్జీవీ ట్విట్టర్ లో ద్వారా రియాక్ట్ అయ్యారు. ఇది చాలా దారుణం అని ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి అన్నారు.

 ఆర్జీవీ వరుస ట్వీట్స్

ఆర్జీవీ వరుస ట్వీట్స్

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తన ఇంట్లో కుక్కకి తాను తినే భోజనం తినిపించిన వీడియోపై గతంలో ఆర్జీవీ స్పందించారు. ఇక ప్రదీప్ ఘటనపై కూడా మేయర్ సరైన విధంగా రెస్పాండ్ కాకపోవడంతో ట్విట్టర్ వేదికంగా ఆర్జీవీ వరుస ట్వీట్ లతో జీహెచ్ఎంసీపై విమర్శలు చేశారు. వరుస ప్రశ్నలతో వీధికుక్కలని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఆర్జీవీ డిమాండ్ చేశాయి.

 ఎందుకు పట్టించుకోలేదని..

ఎందుకు పట్టించుకోలేదని..

ఇదిలా ఉంటే మెడికో స్టూడెంట్ ప్రీతి మరణంతో ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 30 లక్షల ఆర్ధిక సహాయం చేసింది. ప్రీతికి న్యాయం చేసిన ప్రభుత్వం ప్రదీప్ ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. దీంతో జీహెచ్ఎంసి దిగి వచ్చి ప్రదీప్ కుటుంబానికి ఎనిమిది లక్షల ఆర్ధిక సహాయం అందించడానికి హామీ ఇచ్చారు. అలాగే కార్పొరేటర్లు తమ నెలసరి వేతనాన్ని ప్రదీప్ కుటుంబానికి ఇవ్వడానికి ముందుకి వచ్చారు.

ఆర్జీవి రిక్వెస్ట్


ఇక ఆర్జీవీ కూడా ప్రదీప్ తండ్రి అకౌంట్ ని ట్విట్టర్ లో షేర్ చేసి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశారు. దీనిపై రియాక్ట్ అయిన ఆర్జీవీ ఫాలోవర్స్ వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ద్వారా ఆర్జీవీలో ఒక మానవతావాది కూడా ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నారు. అంతే కాకుండా టెంపర్ డైలాగ్ తో మీరు మారిపోయారు సార్.. అంటూ నెటిజన్లు వర్మపై ప్రశంసలు కురిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X