భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? ఆర్జీవీ మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్స్..
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. పుష్ప 2 సినిమా ప్రీమియం షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబీకులు ఫిర్యాదు చేయడంతో సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ పైన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నేడు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటనపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తనదైన శైలిలో స్పందించారు.
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ ను శుక్రవారం నాడు తన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ స్టేట్మెంట్ తీసుకున్నారు . అల్లు అర్జున్ పై 105, 118(1), రెడ్ విత్ 3/5, బి ఎం ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుండి భారీ బందోబస్తు నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.

చంచలగూడ జైలుకు తరలించమని పోలీసులకు తెలిపారు ఈ కేసులో ఏ 11 గా అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. దీంతో మరోవైపు అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టులో quash పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులోను అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. కానీ, ఈ సమయంలో కనీసం మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తులు కోరడంతో కోర్టు 50వేల పూచీకత్తతో బిల్ సాంక్షన్ చేసింది. మరి కొన్ని గంటలలో అల్లు అర్జున్ చంచలగూడా జైలు నుండి విడుదల కానున్నారు.
ఇదిలాఉంటే.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు. ట్వీట్‌లో తెలంగాణ పోలీసులకు, అధికారులకు దిమ్మతిరిగిపోయే ప్రశ్నల వర్షం కురిపించారు. తనకు సమాధానాలు ఇవ్వాలంటూ.. నాలుగు ప్రశ్నలు వేశారు. రామ్ గోపాల్ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవేంటో మీరు కూడా చూసేయండి.

అందులో 1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలలాంటి వేడుకుల్లో తోపులాటల్లో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా?, 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?, 3. ప్రీరిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా?, 4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు? అంటూ ఆర్జీవి దిమ్మతిరిగే ప్రశ్నలు వేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై నేషనల్ క్రష్ రష్మిక మందాన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సంధ్య థియేటర్ ఘటన దురద్రుష్టకరమని తెలిపారు. అయితే.. ఇలాంటి ఘటనలో ఒకే వ్యక్తిని నిందించడం సరికాదని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ను అరెస్టు చేశారంటే.. తాను నమ్మలేకపోతున్నానని, నిజంగా తన హార్ట్ బ్రేకింగ్ అయిందంటూ రష్మిక మందన్నా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











