RGV: 37 ఏళ్ళ తరువాత డిగ్రీ సర్టిఫికెట్ అందుకున్న వర్మ.. వాళ్ళు నన్ను చెడగొట్టారు అంటూ..
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా ఏది చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. ఇక కాంట్రవర్సీ విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే వర్మ ఈమధ్య కాలంలో ఊహించని దారులలో వెళుతున్నాడు.
ఇక ఆయన ఇటీవల తన డిగ్రీ సర్టిఫికెట్ అందుకోవడమే కాకుండా AN యూనివర్సిటీకి వెళ్లి అక్కడ ప్రొఫెసర్లను కూడా కలుసుకున్నారు. గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన సర్టిఫికెట్ ఫొటోను కూడా వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

దర్శకుడిగా..
శివ సినిమాతో దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ అనంతరం చాలా డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక సీరియస్ పాయింట్ ఉంటుంది. ఇక రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని వర్మ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి.

అప్పుడే సినిమాలు చూస్తు
ఇక వర్మ ఇటీవల కాలంలో ఊహించని దారుల్లో వెళుతున్నట్లు అనిపిస్తోంది. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజినీరింగ్ చేసిన వర్మ కాలేజ్ డేస్ లో ఎన్నో అనుభవాలను చూశాడు. ఇక అక్కడ క్లాస్ లకు వెళ్లకుండా ఎక్కువగా సినిమాలు చూసేవాడిని అని కూడా వర్మ చాలా ఇంటర్వ్యూలలో వివరణ ఇచ్చారు.

37 సంవత్సరాల తరువాత..
ఇక రామ్ గోపాల్ వర్మ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ కనీసం తన డిగ్రీ సర్టిఫికెట్ తీసుకునేందుకు కూడా కాలేజ్ కు వెళ్లలేదట. ఇక పాసైన 37 సంవత్సరాల తరువాత తాను డిగ్రీ సర్టిఫికెట్ అందుకోవడం థ్రిల్లింగ్ గా ఉందని వర్మ ఒక ట్వీట్ చేశాడు. 1985 నుంచి నేను దీన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదని అంటూ సివిల్ ఇంజినీరింగ్ ప్రాక్టీస్ చేయడం కూడా తనకు ఇష్టం ఉండేది కాదని చెప్పారు. ఇక ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వర్మ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ గౌరవానికి అర్హుడిని కాదు
నేను గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజ శేఖర్ గారికి చెప్పాను, నేను ఈ గౌరవానికి అర్హుడిని కాదు అని. కానీ ఆయన కారణంగా ఇలా జరిగింది అని మరో ట్వీట్ చేశారు. ఇక నేను సన్మానం పొందడం చాలా భయంగా భావిస్తాను.. అంటూ కానీ ఈసారి గౌరవప్రదమైన సందర్భంలో అలాంటి గౌరవప్రదమైన వ్యక్తులతో కలిసి ఉండడం నిజంగా గౌరవంగా భావించాను.. అని మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

వారు నన్ను చెడగొట్టారు
ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఉన్నత విద్యావంతులైన ఆచార్యులతో చదువుకోలేని నేను అంటూ మరో ఫొటో పోస్ట్ చేశారు. ఇక యూనివర్సిటీలో ప్రత్యేకంగా స్పీచ్ ఇచ్చిన వర్మ ఆచార్యనాగార్జున యూనివర్శిటీ విద్యార్థులను, పండితులను చెడగొట్టడానికి ప్రయత్నించాను, కానీ వారు నన్ను చెడగొట్టారు.. అని మరో ట్వీట్ లో సరదాగా వివరణ ఇచ్చారు. ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











