twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak భూకంపం.. రామ్ గోపాల్ వర్మ రివ్యూ.. అందుకే ముందు అలా చెప్పాను అంటూ

    |

    విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎలాంటి కామెంట్స్ చేసిన కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతుంయాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొన్ని రోజులుగా ఆయన భీమ్లా నాయక్ సినిమాపై అదేపనిగా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక విధంగా పవన్ కళ్యాణ్ పై ఆయన సెటైర్లు వేస్తున్నారు అని ఓ వర్గం ఫ్యాన్స్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక మరోసారి రాంగోపాల్ వర్మ సినిమాను చూశారో లేదో తెలియదు కానీ పాజిటివ్ గా రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా షార్ట్ రివ్యూ కూడా ఇచ్చారు. ఇక వర్మ ఏమన్నారు అనే వివరాల్లోకి వెళితే..

    పాజిటివ్ టాక్

    పాజిటివ్ టాక్

    పవర్ స్టార్ పవన్కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా భీమ్లా నాయక్ శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ప్రీమియర్స్ షోల నుంచి కూడా సినిమా అద్భుతంగా ఉంది అని టాక్ మొదలయింది.

    పాలాభిషేకం..

    పాలాభిషేకం..

    అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ హౌస్ లలో ఎక్కడ చూసినా కూడా భీమ్లా నాయక్ ట్యాగ్ అయితే వైరల్ అవుతుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ సినిమా థియేటర్స్ లలో కూడా భీమ్లా నాయక్ కటౌట్స్ కి అభిమానులు పాలాభిషేకం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

     భీమ్లా భూకంపం

    భీమ్లా భూకంపం

    ఇక రీసెంట్ గా దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి భీమ్లా నాయక్ సినిమా పై తనదైన శైలిలో ట్విట్టర్ ద్వారా స్పందించారు ప్రయత్నం చేశారు. భీమ్లా నాయక్ అనేది ఒక తండర్ స్ట్రామ్ అంటూ అందులో పవన్ కళ్యాణ్ ఒక సునామీ అని, ఇక రానా దగ్గుబాటి నెక్ టూ నెక్ పోటాపోటీగా నటించినట్లుగా వివరణ ఇచ్చారు. వరల్డ్ వైడ్ గా సినిమా అయితే భూకంపం లాంటిది అని సంబోధించారు.

    సెన్సేషన్..

    ఇక మరొకటి ట్వీట్ లో రాంగోపాల్ వర్మ ఈ సినిమాను ఎందుకు హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని తను తెలిపినట్లుగా పేర్కొన్నారు. తప్పకుండా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు ట్రైలర్ పై కూడా వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అసంతృప్తికి గురి చేశాయి.

    మొదటి రోజు వసూళ్లు ఎంత రావచ్చంటే?

    ఇక భీమ్లా నాయక్ సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో వసూళ్లను అందుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన యూఎస్ ప్రీమియర్స్ 700K డాలర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈజీగా 1 మిలియన్ డాలర్లు అందుకునే అవకాశం ఉందట. ఇక బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 27కోట్ల నుంచి 30కోట్ల మధ్యలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    English summary
    Ap government arranged CPRF for Bheemla nayak 60 theaters closed,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X