RGV Tweet: పవన్ కళ్యాణ్ నా పోస్టర్ కాపీ కొట్టాడు... రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ సినిమాలు చేయడం మానేశాడు. ఆయన కేవలం వివాదాస్పదమవుతాయి అనుకున్న సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన వ్యూహం అనే సినిమా చేస్తున్నాడు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎవరెవరు ఎలా ప్రతిస్పందించారు.

ఆ తర్వాత ఎలాంటి కుట్రలు జరిగాయి అనే విషయం మీద తన కోణాలను ఆవిష్కరించేందుకు ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. గతంలో రాంగోపాల్ వర్మతో వంగవీటి లాంటి సినిమా చేసిన దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నగా రంగం సినిమాతో తెలుగువారికి పరిచయమైన అజ్మల్ ఈ సినిమాలో వైయస్ జగన్ పాత్రలో నటిస్తున్నాడు.

 Director Ram Gopal Varma Sensational tweet on Pawan Kalyan pose

ఇప్పటికే వైఎస్ జగన్ కి సంబంధించి అనేక షూటింగ్ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తూ ఉండగా రాంగోపాల్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటి షేర్ చేశారు. షేర్ చేసిన పై ఫోటో కొద్ది రోజుల క్రితం వ్యూహం సినిమా నుంచి నేను విడుదల చేసిన ఫోటో కింద ఫోటో రాత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్న ఫోటో అని ఆయన షేర్ చేశారు.

 Director Ram Gopal Varma Sensational tweet on Pawan Kalyan pose

వాస్తవానికి నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకుని ఏసీబీ కోర్టుకు తరలించారు. అదే సమయానికి పవన్ కళ్యాణ్ విజయవాడ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయన చంద్రబాబును కలుస్తాడేమో అనే ఉద్దేశంతో పోలీసులు ఎట్టి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ విజయవాడ రానీయకుండా ఉండేందుకు శత విధాలా ప్రయత్నించారు.

 Director Ram Gopal Varma Sensational tweet on Pawan Kalyan pose

పవన్ కళ్యాణ్ ముందుగా ఒక ఫ్లైట్ లో రావాలి అనుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఎయిర్పోర్టులోకి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దని కోరారు. దీంతో పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో బయలుదేరి రావడంతో గరికపాడు చెక్ పోస్ట్ నుంచి ఆయనను పోలీసులు అడ్డుకుంటూనే వచ్చారు. చివరికి ఒకానొక దశలో పూర్తిస్థాయిలో నిర్బంధించే ప్రయత్నం చేయగా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద కూర్చుని కాసేపు తర్వాత అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. అక్కడి ఫోటోని షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ తన వ్యూహం పోస్టర్లో ఎలా ఉందో అలాగే పవన్ కళ్యాణ్ కాపీ కొట్టాడు అని అంటూ అర్థం వచ్చేలా ఆయన రాసుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X