కల్తీ లేని ఒక మగాడి ఉద్వేగం లోంచి వచ్చిందే...రామ్ గోపాల్ వర్మ
రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ లో ప్రప్రధమంగా 'కధ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం: అప్పలరాజు' సినిమాలో స్వయంగా ఒక పాట రాసారు. అయితే ఆ పాట ఎందుకు రాయాల్సి వచ్చిందో..ఆ సందర్భం ఏమిటనేది ఆయన ప్రేస్ నోట్ తో ప్రపంచానికి తెలియపరిచారు. ఆయన మాటల్లోనే...'ఏమెట్టి పెంచారు అమ్మ నాన్న నిన్ను?' అనే ఈ పాటని ఇంకో గీతరచయిత తోటి రాయించకుండా నేనే రాయటానికి కారణం...నా దృష్టిలో స్త్రీ అందాన్ని నాకన్నా తాధ్యామికంగా ఇంకెవ్వరూ చూడరు, చూడలేరు. ఆ మహోన్నత అందమే ఒక కఠోరమైన రాయిలాంటి నన్ను కూడా ఒక కవిలా మార్చేసింది. ఆ అందాల విందుకు నేను దాసుడిని, ఆ అభినయ దేవతకు ఒక బానిసనై స్త్రీని భగవంతుడు సృష్టి౦చిన అత్యంత మహా సృష్టిగా భావించి, ప్రేమించి, గౌరవించి, ఆరాధించి రాసిన పాటే ఈ 'ఏమెట్టి పెంచారు అమ్మా నాన్న నిన్ను?. ఈ నాపాట స్త్రీలందరికీ అంకితం. ఈ పాట రాయటానికి నేను ఎన్నుకున్న మాటల్ని కవిత్వంతో చెడగొట్టకుండా కేవలం ఒక అమ్మాయి పట్ల చెలరేగిన, కల్తీ లేని ఒక మగాడి ఉద్వేగం లోంచి వచ్చిన శబ్దాలతో రాసాను. అమ్మాయిలను ఇంతలా పోగిడినందుకు అబ్బాయిలకు కోపం వస్తుందేమో అని బ్యాలెన్స్ చెయ్యటానికి, అదీ కాకుండా 'అప్పలరాజు' సినిమాలో ఇది డ్యుయెట్ గనక అమ్మాయితో అబ్బయిని కూడా పోగిడించాను. ఈ పాటలో అమ్మాయి గురుంచి నేనన్న నా మాటలన్నీ నా హృదయంలో నుంచి వచ్చినవి. అబ్బాయి గురుంచి అన్నవన్నీ ఉత్తుత్తివి అంటున్నారు రామ్ గోపాల్ వర్మ.


Click it and Unblock the Notifications











