కరోనా కాలంలో బిజీగా ఉన్న ఏకైక దర్శకుడు RGV.. ఎన్ని సినిమాలు సిద్ధం చేస్తున్నాడో తెలుసా?
కరోనా వైరస్ ధాటికి షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. రెమ్యునరేషన్స్ మునుపటి కంటే ఎక్కువ ఇస్తామని చెప్పినా కూడా కొందరు షూటింగ్స్ చేయడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. దాదాపు ఇండస్ట్రీలో చిన్న దర్శకుల నుంచి పెద్ద దర్శకుల వరకు అందరు ఖాళీగానే ఉన్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం మునుపెన్నడు లేనంత బిజీగా ఉన్నాడు. గతంలో కంటే వర్మ ఇప్పుడే ఎక్కువ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.

RGV కంపెనీలోనే..
కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సినిమా షూటింగ్స్ లేక చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు నిర్మాతలు అయితే మరో ఏడాది వరకు సినిమాలను నిర్మించకూడదని డిసైడ్ అయ్యారు. అయితే వర్మ మాత్రం తన RGV కంపెనీలోనే చాలా స్పీడ్ గా సినిమాలను నిర్మిస్తున్నాడు. అందుకోసం సపరేట్ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఆ కాన్సెప్ట్ క్లిక్కవ్వడంతో..
మొదట లాక్ డౌన్ లో వర్మ మియా మాల్కోవాతో తీసిన క్లైమాక్స్ అనే సినిమాని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓటీటీలో రెస్పాన్స్ అదిరిపోవడంతో వెనువెంటనే పాత స్క్రిప్ట్ లను కూడా బయటకు తీశాడు. ఇక నగ్నం కాన్సెప్ట్ కూడా క్లిక్కవ్వడంతో వర్మ తన అసిస్టెంట్స్ కి మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఓ విధంగా లాక్ డౌన్ లో వర్మ తన టీమ్ సబ్యులకు నిత్యం పనులు కల్పిస్తున్నారనే చెప్పాలి.

RGV ప్రమోషన్ డోస్..
ఇక నగ్నం సినిమా అనంతరం వర్మ దాదాపు మరో 9 సినిమాలను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. నెక్స్ట్ పవర్ స్టార్ సినిమాను రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా వర్మ ఈ సినిమాకు చేస్తున్న ప్రమోషన్స్ అంతా ఇంతా కాదు. గ్యాప్ లేకుండా పోస్టర్స్ ని వదులుతూ ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. పవర్ స్టార్ సినిమా తర్వాత కరోనా వైరస్ కి సంబంధించిన సినిమానే కాకుండా మిర్యాలగూడ పరువు హత్యపై మర్డర్ అనే సినిమాను కూడా విడుదల చేయనున్నాడు.
Recommended Video

ఆ తొమ్మిది సినిమాలు..
అదే విధంగా థ్రిల్లర్, లాక్ డౌన్, హారర్, స్మార్ట్ ఫోన్ అనే మరో కొత్త తరహా కాన్సెప్టులను కూడా రెడీ చేస్తున్నాడు. రానున్న రోజుల్లో ప్రస్తుతం రెడీ చేస్తున్న 9 సినిమాలను తన ఓటీటీ వరల్డ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వర్మ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం అలసట ప్రదర్శించడం లేదు. గ్యాప్ లేకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాలకు తనదైన శైలిలో క్రేజ్ పెంచుకున్నాడు. మరి ఆ కాన్సెప్టులతో వర్మ ఎలాంటి ప్రాఫిట్స్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











