RGV: ఆర్జీవి వ్యూహంలో నారా లోకేశ్‌కు బిగ్ షాక్... సినిమాకు లైన్ క్లియర్.. థియేటర్లలోకి ఆ రోజే!
కాంట్రవర్శీలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆయన తెరకెక్కించిన మరో వివాదాస్పద మూవీ వ్యూహం. ఏపీ రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్ర రిలీజ్‌కు ఎదురైన అడ్డంకులన్నీ తాజాగా తొలిగిపోయాయి. విడుదలకు లైన్ క్లియర్ అయింది. వివరాల్లోకి వెళితే...
గతంలో శివ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య అన్నీ వివాదాస్పద సినిమాలను మాత్రమే చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా చర్చనీయాంశంగా మారే చిత్రాలను మాత్రమే చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు. పబ్లిక్ డొమైన్లో ఉన్న రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీల లైఫ్ స్టోరీలను ఆధారంగా చేసుకుని కాంట్రవర్సీ చిత్రాలను చేస్తున్నారు. లేదంటే బోల్డ్ కంటెంట్ సబ్జెక్ట్ ఉన్న కథలను తీస్తున్నారు.

అయితే తాజాగా ఆయన ఏపీ రాజకీయల నేపథ్యంలో వ్యూహం సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఎంతో కాంట్రవర్సీని అందుకుంది. దీన్ని ఆపాలని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. ఆ మధ్యలో అయితే ఈ వ్యూహం సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధమైనప్పటికీ కొన్ని అడ్డంకులను ఎదుర్కొంది. ఈ చిత్ర రిలీజ్‌ను నిలిపివేవయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తేదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ సినిమాను రూపొందించారని పిటిషన్‌లో లోకేశ్ పేర్కొన్నారు. దీంతో వ్యూహం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది న్యాయస్థానం. ఈ మేరకు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది. అలా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆగిపోయింది.
ఈ క్రమంలో అప్పుడు చిత్ర నిర్మాత, దర్శకుడు కూడా హైకోర్టును ఆశ్రయించి ప్రతిగా పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు సినిమాను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫికేట్‌ను జారీ చేయాలని సెన్సార్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది.
ఇక న్యాయస్థానం ఆదేశాల మేరకు మరోసారి వ్యూహం సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు తాజాగా యూ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. దీంతో వ్యూహం చిత్రం రిలీజ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రం ఇక ఈ నెల 16న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇకపోతే రామ్ గోపాల్ వర్మ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించారు. ధనంజయ్ ప్రభునే, సురభి ప్రభావతి, రేఖ సురేఖ కూడా ఇతర పాత్రల్లో నటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారాయి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, రాగానే ఏం చేశారనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ప్రారంభించి ఎలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారనే దాన్ని ఇందులో చూపించనున్నారు.


Click it and Unblock the Notifications











